సగరుల అభివృద్ధికి కృషి చేయాలి

By dhanadhannews.com

  • ఐకమక్యంతో ముందుకెళ్లాలి
  • జిల్లా సగర సంఘం ఎన్నికలల్లో రాష్ర్ట అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: సగరులు ఐకమక్యంతో పని చేస్తూ వారి ఆర్థికఅభివృద్ధికి కృషి చేస్తూ ముందుకెళ్లాలని రాష్ర్ట సగర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర అన్నారు.హుజురాబాద్ పట్టణంలోని కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో సగర సంఘం ఎన్నికలు జరిగాయి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సగరులను ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని, సగరుల సమస్యలపై ప్రభుత్వాలపై పోరాటం చేసేందుకు ఐకమత్యంతో ముందుకెళ్లాలని సూచించారు. ఎన్నికలు అనగానే ఎవరూ కూడా వ్యక్తిగతంగా తీసుకోకుండా సోదర భావంతో తీసుకుని ఎన్నికల అనంతరం అందరూ ఐకమత్యంగా పనిచేస్తూ సగరుల అభివృద్ధిని ఆంకాంక్షిస్తూ ముందుకెళ్లాలని సూచించారు. అనంతరం ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు.

కార్యవర్గం ఎన్నిక

హుజురాబాద్ పట్టణంలోని కేరళ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహించిన ఎన్నికలలో అధ్యక్షుడిగా దేవునూరి శ్రీనివాస్ సగర,ప్రధాన కార్యదర్శిగా కట్టరాజు సగర,కోశాధికారిగా కాటిపెల్లి కుమారస్వామి సగర గెలుపొందారు.ఈ కార్యక్రమంలో రాష్ర్ట సగర సంఘం గౌరవ అధ్యక్షుడు ముత్యాల హరికిషన్,రాష్ర్ట ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర,రాష్ర్ట కోశాధికారి వడ్లకొండ కుమారస్వామి సగర,ఉపాధ్యక్షుడు నలుబాల భిక్షపతి సగర,కార్యనిర్వాహణ కార్యదర్శి కానిగంటి శ్రీనివాస్ సగర, మహిళా విభాగం అధ్యక్షురాలు గాండ్ల స్రవంతి సగర,యువజన విభాగం అధ్యక్షుడు మర్క సురేష్, ప్రధాన కార్యదర్శి ఉప్పరి మహేందర్ సగర,  హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి కురుమళ్ళ కుమారస్వామి, రాష్ర్ట కమిటీ సభ్యులు బొడిపెల్లి కొటేశ్వర్ సగర, కుర్మిండ్ల రాజు సగర, నలుబాల మధు సగర, సీనియర్ నాయకులు ఏరుకొండ ప్రసాద్ సగర, నలుబాల మురళి సగర, దేవునూరి శ్రీనివాస్ సగర్, గుంటి శ్రీనివాస్ సగర, నలుబాల వేణు సగర తదితరులు పాల్గొన్నారు.