- బస్సు సౌకర్యంతో పాటు రేషన్ షాపు ఏర్పాటు చేయించండి
- రేషన్ బియ్యం కోసం రెండు కిలోమీటర్లు నడవాల్సిందే
- బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దోకిడి తిరుపతి
సైదాపూర్/ధనాధన్ న్యూస్:
పాలకులు మారినా…ప్రభుత్వాలు మారినా…ప్రజల ఇబ్బందులు తప్పడం లేదు…కొత్త గ్రామపంచాయతీగా ఆవిర్భవించిన గర్రెపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యము లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యంతో పాటు గ్రామంలో రేషన్ షాపు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దోకిడి తిరుపతి అన్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…హుస్నాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయంపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి సమస్య పరిష్కారం చెయ్యాలి అని ఆశాభావం వ్యక్తం చేశారు.బస్సు సౌకర్యం లేకపోవడంతో మోడల్ స్కూల్ విద్యార్థులు,ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో గర్రెపల్లెకు సరైన రోడ్డు నిర్మాణం లేక బస్సు సౌకర్యం కల్పించలేదని,ఇప్పుడు తమ గర్రెపల్లెకు రోడ్డు నిర్మాణంతో పాటు, బ్రిడ్జి నిర్మాణం కూడా జరిగిందని తమకు బస్సు సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని, గర్రెపల్లేను నూతన గ్రామ పంచాయతీగా ప్రకటించడం సంతోషంగా ఉందని ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.రేషన్ బియ్యం కోసం రెండు కిలోమీటర్ల దూరం వెళ్లి తీసుకోవాల్సి వస్తుందని,సోమారం పరిధిలోని 4పల్లెలకు ఒక్కరే రేషన్ డీలర్ ఉండడంతో అంత దూరం వెళ్లి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉందన్నారు.తమ పల్లెలోనే బియ్యం ఇస్తే అందరికీ అందుబాటులో ఉంటుందని తెలిపారు.వృద్ధాప్యంలో ఉన్నవారు అంత దూరం వెళ్లి బియ్యం తీసుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.పోస్ట్ మెన్ పనితీరు చాలా ఇబ్బందిగా మారిందని,తమకు ఏమైనా ఉత్తరాలు వస్తే సోమరంలో ఇస్తున్నాడని దీంతో రోజులు గడుస్తున్న లేటర్ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు , తిపిశెట్టి మహేష్,జాల రమేష్, దోకిడి నరేష్,తదితరులు ఉన్నారు.
