సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెంకటేశ్వర పల్లె గ్రామంలో సంక్రాంతి పండుగ పర్వదినాన వెంకటేశ్వర పల్లె గ్రామంలో భక్తాంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.భక్తాంజనేయ స్వామి దేవాలయ కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని అంగరంగ వైభోగంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. వెంకటేశ్వర పల్లి గ్రామ మహిళలు పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి భక్తా ఆంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధి కమిటీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ముగ్గుల పోటీలో గెలుపొందిన మహిళలు ప్రథమ బహుమతి బత్తుల కావ్య 2వ బహుమతి దయ్యాల మమత 3వ బహుమతి వంగపెల్లి సరితలు గెలుపొందారు.ఈ కార్యక్రమంలో భక్తాంజనేయ దేవాలయ కమిటీ సభ్యులు గౌరవాధ్యక్షులు రాయిశెట్టి చంద్రయ్య అధ్యక్షులు బత్తుల జయపాల్ ఉపాధ్యక్షులు గాజర వేణి మల్లయ్య కొండి తిరుపతి ప్రధాన కార్యదర్శి రావిశెట్టి రఘుపతి కోశాధికారి గంగిశెట్టి రాజయ్య , సంయుక్త కార్యదర్శి తిప్పిరి శెట్టి శ్రీనివాస్,ముఖ్య సలహాదారులు గొల్లపల్లి శ్రీనివాస్,గాజర వేణి వెంకట స్వామి, బొడిగ కొమురయ్య,కార్యవర్గ సభ్యులు భాష వేని లింగయ్య,దొంత ధర్మయ్య, శనిగరం శ్రీనివాస్,కాటిక రమేష్,సత్కు లక్ష్మీకాంత్,ఉప్పుల వీరన్న,గుర్రం కుమారస్వామి,బొడిగ సంజీవ్,కొలిపాక అంజి,కార్యనిర్వాహణ కర్త తిపిరిశెట్టి లక్ష్మణ్ , చంద్రమౌళి,కరుణాకర్,తిరుమల్,రవి,తిరుపతి, శ్రీకాంత్,శ్రీనివాస్,కుతుబుద్దీన్ మరియు రాకేష్, శ్రీనివాస్,గ్రామ యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.
