అక్రమ మట్టి తరలింపుపై చర్యలేవి

By dhanadhannews.com

  • చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నా ప్రభుత్వ అధికారులు
  • పిర్యాదు చేస్తే పట్టింపేది
  • జిల్లా కాంగ్రెస్ పార్టీ ఫిషర్ మెన్ చైర్మన్ బండి మల్లేష్

ఇల్లందకుంట(ధనాధన్ న్యూస్)మే12:ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామానికి చెందిన చెరువులో కంచె గోవర్ధన్ అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చెర్లమట్టిని గృహాలకు తరలిస్తున్నారు.ఈ విషయమై మండలాధికారులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కానీ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఫిషర్ మెన్ చైర్మన్ బండి మల్లేష్ అన్నారు.కనగర్తి గ్రామానికి చెందిన చెర్లు కుంటలను 2022 నుండి రెండు సంవత్సరాలుగా దొంగతనంగా చెరువులోని మట్టిని అమ్ముకుంటూ అధికారులను రాజకీయ పార్టీ నాయకులకు ముడుపులు అప్పచెప్పుతూ చెరువులను అన్యక్రాంతం చేస్తున్నాడని ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మల్లేష్ కోరారు.చెర్లలో మట్టి తీసే జెసిబి,ట్రాక్టర్లకు సరైన పత్రాలు లేవని గ్రామాలలో విచ్చలవిడిగా అక్రమ మట్టి మాఫియా గ్రామాల్లో కొనసాగుతుందని ప్రతి సంవత్సరం ఎండాకాలం వచ్చిందంటే చెరువులో నీరు ఎండిపోగానే ఈ అక్రమ మట్టి మాఫియాకు తెరతీస్తూ గ్రామంలో ఉన్న చెర్లను నిబంధనలకు విరుద్ధంగా మట్టి తీసి  తలిస్తున్నారని అన్నారు.ఈ విషయమై తక్షణమే ప్రభుత్వ అధికారులు ఎలాంటి పత్రాలు లేని వాహనాలను స్విచ్ చేసి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మల్లేష్ కోరారు.