మట్టి మాఫియా పై చర్యలేవి

  • ప్రభుత్వ భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు
  • ప్రభుత్వ భూములను బొందల గడ్డగా మారుస్తున్న అక్రమార్కులు
  • అక్రమార్కులకు వంత పాడుతున్న సంబంధిత అధికారులు
  • అక్రమ దందాకి వ్యవసాయ ట్రాక్టర్లు
  • మట్టి తవ్వకాల్లో నిబంధనలకు నీళ్లు

జమ్మికుంట పట్టణం దిన దిన అభివృద్ధి చెందుతుండడంతో పట్టణం లో గృహాలు, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు శరవేగంగా జరుగుతుండడంతో భవన నిర్మాణ అవసరాల దృశ్య, యజమానుల అవసరాలను ఆసరాగా తీసుకున్న మట్టి అక్రమ వ్యాపారులు మండలంలోని చుట్టూ ప్రక్కల గ్రామాలలోని ప్రభుత్వ భూముల్లోని అక్రమ మొరం దందా యదేచ్చగా కొనసాగిస్తున్నారు.సహజ సంపదను కొల్లగొట్టి ఆదాయ వనరుగా మార్చుకుంటు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు.జమ్మికుంట మండలంలోని పెద్దంపల్లి గ్రామ శివారులో గల సర్వే నంబర్ 1405 గల భూమిలో కొందరు అక్రమార్కులు అనుమతులు లేకుండానే మొరం మట్టి తవ్వేస్తున్నారు.ఈ అక్రమ దందా వ్యాపారంలో ఉన్న జెసిబి ఓనర్స్,ట్రాక్టర్ల ఓనర్స్,ఈ దంద చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.అయితే వ్యవసాయానికి వాడుకోవాల్సిన ట్రాక్టర్లను ఈ అక్రమ మోరం దంధా కు వినియోగించడం,ఈ వ్యవహారాన్ని చూసి చూడనట్టుగా అధికారులు వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తుంది.ఒక్కో ట్రాక్టర్ లోడు మొరం మట్టికి రూ.వెయ్యి నుండి 1500 రూ.వరకు వసూలు చేసుకుంటున్నారు.లక్షల రూపాయల్లో అక్రమార్చన చేస్తూ మూడు పువ్వులు ఆరు కాయలుగా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.మైనింగ్ నిబంధనలకు విరుద్దంగా అక్రమ మట్టి తవ్వాకాలు చేస్తున్న అక్రమ మట్టి వ్యాపారులపై మైనింగ్, రెవిన్యూ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.