హుజురాబాద్ లో కాంగ్రెస్ కు మెజారిటీ

By dhanadhannews.com

  • పోటీలో నిలబడ్డ కాంగ్రెస్,రెండో స్థానానికి కాంగ్రెస్
  • హుజురాబాద్ లో అన్ని తానై నడిపించిన వొడితల ప్రణవ్
  • ఎమ్మెల్యేగా ఉన్న హుజురాబాద్ లో పని చేయని కౌశిక్ రెడ్డి మంత్రం

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)జూన్04:ఈరోజు వెలువడినటువంటి లోక్ సభ ఫలితాల్లో ఆశించిన ఫలితం రాకపోయినా బీజేపీ,బిఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టి గట్టి పోటీ ఇచ్చామని హుజురాబాద్ నియోజక వర్గ ఇంఛార్జి వొడితల ప్రణవ్ అన్నారు.హుజురాబాద్ నుండి అద్భుతమైన మెజారిటీ ప్రజలు ఇచ్చారని దీనికి నియోజకవర్గ ప్రజలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. హుజురాబాద్ లో స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉన్నా కూడా బిఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేసినందుకు,పార్టీపై నాపై ఎల్లప్పుడూ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ,ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ సైనికులకు అభినందనలు తెలియజేస్తూ,రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపట్టబోయే ఏ పథకాన్ని అయినా హుజురాబాద్ గడపగడపకు అందించేలా కృషి చేస్తానని మీ ఇంటి బిడ్డగా ప్రతి సంక్షేమ పథకాన్ని మీ గడపగడపకు అందిస్తానని తెలియజేశారు.మరొకసారి హుజురాబాద్ నుండి మంచి మెజారిటీ ఇచ్చినందుకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.