సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దేనపల్లి గ్రామపంచాయితీ కార్యాలయంలో సోమవారం రోజున ఉడిగే విజయ రాజశేఖర్ ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా వచ్చిన హుజురాబాద్ డిపో డిఎమ్ చేతులమీదుగా దివ్యాంగులకి ఉచిత బస్ పాస్ లు పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యఅతిథిగా వచ్చిన హుజురాబాద్ డిఎమ్ ని శాలువాతో సన్మానించారు. అనంతరం హుజూరాబాద్ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ దివ్యాంగులు ఆర్టీసీ ఉచిత బస్ పాస్లు వినియోగించుకోవాలని,ఆర్టీసి బస్సులో ప్రయాణం సురక్షితం అని,ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం వల్ల తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయవచ్చునని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ కార్యదర్శి ఆర్ శ్రీనివాస్,మాజీ సర్పంచి తాటిపల్లి యుగంధర్ రెడ్డి,ఆదిరెడ్డి,మరియు ఆర్టీసీ సిబ్బంది బోల్ల హరీష్,జెట్టి కనకయ్య,అంజయ్య, శ్రీనివాస్,రవి,రాజయ్య,రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.
