- విత్తనాలు కొనేటప్పుడు రషీద్ తప్పనిసరిగా తీసుకోవాలి
- హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ
హుజురాబాద్(ధనాధన్ న్యూస్)మే24:వర్షాకాలం వస్తుండడంతో రైతులు దుక్కి దున్ని పంట సాగుచేయడానికి విత్తనాలు ఎప్పుడు వస్తాయా పంట ఎప్పుడు వేయాలా అని ఎదురుచూస్తూ ఉంటారని,రైతుల అవసరాన్ని ఆసరా చేసుకునే కొందరు నకిలీ విత్తనాలు రైతులకు అమ్మి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తారని రైతులు జాగ్రత్తగా ఉండాలని హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ తెలిపారు.హుజురాబాద్ లోని ఏసీపీ కార్యాలయం లో డివిజన్ లోని పోలీస్ అధికారులతో కలిసి జై కిసాన్ పోస్టర్ ని ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఏసీపీ శ్రీనివాస్ జీ మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్లో మంచి విత్తనాలతో పాటు,నకిలీ విత్తనాలు బెడద ఎక్కువగా ఉన్నందున రైతులు మోసపోకుండా విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా బిల్లు, విత్తనం యొక్క లాట్ నెంబర్,ఎక్సపయరి తారీకు బిల్లు పై ఉండేలా చూసుకోవాలని తెలిపారు.ఎక్కడైనా తక్కువ ధరకు వస్తున్నాయని ఆశపడి నకిలీ విత్తనాలు తీసుకుంటే భారీగా నష్టపోవాల్సివస్తుందని తెలిపారు.ఎవరైనా ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు మీ దృష్టి కి వస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో కానీ,వ్యవసాయ అధికారులకు కానీ సమాచారం అందించాలని కోరారు.మేము అందించిన ఈ సూచనలు పాటించి నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేసి అధిక రాబడులు పొందాలని కోరారు.అనంతరం జమ్మికుంట పట్టణంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను జమ్మికుంట ఏఓ తో కలిసి తనిఖీ చేశారు.ఈ కార్యక్రమం లో డివిజన్ పరిధిలోని సీఐ లు, ఎస్ఐ లు పాల్గొన్నారు.
