- మొరంపోయడం పట్ల కాలనీ వాసులు ఆనందం
- బురద సమస్య నుంచి ఉపశమనం కలిగించిన ప్రణవ్
హుజురాబాద్/ధనాధన్ న్యూస్: మాట ఇవ్వడమే కాదు దాన్ని నిలబెట్టుకున్నప్పుడే నిజమైన లీడర్ అవుతాడని నానుడి.దానికి తగ్గట్టుగా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి గతంలో హుజురాబాద్ పట్టణంలోని గాంధీనగర్ లోని బేడ బుడగ జంగాల కాలనీకి వెళ్లినప్పుడు అక్కడ నివసించే ప్రజలు మా కాలనీ యొక్క అవస్థలు చూడమని ప్రణవ్ కు తెలుపగా స్పందించిన ప్రణవ్ త్వరలోనే మీ కాలనీకి తగిన సాయం చేస్తానని మాట ఇవ్వడం జరిగింది.ఇచ్చిన మాట ప్రకారం బుధవారం రోజున ఆ కాలనీలో మొరం పోయించి చదును చేపించారు.భారీ వర్షాలు కురుసిన ప్రతీ సమయంలో కాలనీ అస్తవ్యస్తం అవుతుందని,ఇన్నాళ్లుగా తమ కాలనీనీ పట్టించుకునే నాథుడే కరువయ్యాడనీ,సమస్య చెప్పిన కొద్దిరోజుల్లోనే పరిష్కారం చూపిస్తున్న ప్రణవ్ కు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలియజేశారు.రాజకీయాలకతీతంగా సమస్యల పరిష్కారవిషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని ఇలాగే కొనసాగి సమస్యలను పరిష్కారం చేయాలని కోరారు.కొన్నేళ్లుగా పరిష్కారం కానీ సమస్యలను కూడా మానవతా దృక్పధంతో ప్రణవ్ చేస్తున్నాడని పలువురు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో కాలనీవాసులు,బెడ బుడిగ జంగాల నాయకులు పాల్గొన్నారు.
