- ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తాడిచెట్టులాగా పెరిగాడు కానీ సబ్జెక్టు లేదు
- బీజేపీ,బిఆర్ఎస్ పార్టీలకు ఓట్లడిగే నైతిక అర్హత లేదు
- హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్
కరీంనగర్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 14:బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలకాలంలో ప్రజా వ్యతిరేక విధానాలు,తెలంగాణ రాష్ట్రానికి చేసిన అన్యాయం,కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలలు మరియు విభజన చట్టంలో ఆమలు కాని హామీలపై ఆదివారంనాడు కరీంనగర్ లో బీసీ మరియు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేపట్టిన నిరసనదీక్షలో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ పాల్గొన్నారు.ఈ సంధర్బంగా అయన మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి నియోజకవర్గంలో ఉండక, ఉనికి కోసం పక్క నియోజకవర్గంలో వెళ్లి సినిమా డైలాగులు కొడుతున్నాడు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మంత్రుల పైన విమర్శలు చేస్తూ తిరుగుతున్నాడు.పెద్దవాళ్ళను విమర్శిస్తే పెద్ద పేరు వస్తుంది అనుకుంటే పొరపాటు,దేనికైనా ఓ స్థాయి ఉండాలనే విషయం కౌశిక్ రెడ్డి తెలుసుకుంటే మంచిదని అన్నారు.బిజెపి పార్టీ అంటే
సోషల్ మీడియాలో పేపర్లో వార్తలతో,ప్రచారాలు తప్ప అభివృద్ధిలో చేసింది ఏం లేదు.బండి సంజయ్ ఎంపీగా హుజరాబాద్ నియోజకవర్గానికి
ఏఏ నిధులు తీసుకువచ్చారో హుజరాబాద్ ప్రజలకు చెప్పాలి.బిజెపి పార్టీలో చేరకపోతే సిబిఐ,ఈడితో రైడ్ చేపిస్తారు,బిజెపి ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉండదు.హుజురాబాద్ నియోజకవర్గం లోని కమలాపూర్ లో రైల్వే బ్రిడ్జి లేక అక్కడ ప్రజలు అంబులెన్స్ లో రోగులను తీసుకొని వెళ్తే ఇబ్బంది పడుతున్నారని,అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్,బండి సంజయ్ ఉప్పల్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేయలేదని అన్నారు.మళ్లీ ఇప్పుడు వచ్చి ఎలా ఓట్లు అడుగుతారని,ఓట్ల కోసమే మళ్ళీ అభివృద్ధి అంటున్నారు.పార్లమెంటులో పరిధిలోని ఏడు అసెంబ్లీలో నియోజకవర్గాలతో పోటీ పడి హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అత్యధిక ఓట్లు తీసుకవచ్చే బాధ్యత నాదని ప్రణవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
