- తెలంగాణ అంబేడ్కర్ యువజన సంఘం హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జీ రాచపల్లి సాగర్
జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామంలో ఎర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచపల్లి సాగర్ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా గజ్జెల కాంతంకి ఇవ్వాలని తెలంగాణ అంబేడ్కర్ యువజన సంఘం హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జీ రాచపల్లి సాగర్ కాంగ్రెస్ పార్టీ ని కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షల మంది మాదిగలు గత ప్రభుత్వం చేసిన అణచివేతను గమనించే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యావత్తు మాదిగలు కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి ప్రభుత్వం ఏర్పడుటలో ముఖ్య భూమిక పోషించారు.పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని ఎస్సీ లకు రిజర్వ్ చేసిన నాటి నుండి నేటి వరకు మాదిగలకు అన్యాయం జరుగుతూనే ఉంది అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఒకే కుటుంబానికి అవకాశాలు కల్పిస్తూ వచ్చాయి.ఇలా ప్రతి విషయంలో కూడా మాదిగ జాతికి అన్యాయం జరుగుతూనే ఉన్నది.కాబట్టి ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ టిక్కెట్టు స్థానాన్ని మాదిగ లకే ఇవ్వాలని అది కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఎన్నో ఉద్యమాలు చేసిన తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం కే ఇవ్వాలని అలా అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే పెద్దపల్లి లో అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని రాష్ట్రం లోని మాడిగలందరు కాంగ్రెస్ పార్టీ పక్షాననే ఉంటారని రాచపల్లి సాగర్ అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు రాచపల్లి నవీన్,చంద్రగిరి రజనీకాంత్, రాచపల్లి అజయ్,రాచపల్లి వంశీ, రాచపల్లి అశ్విన్,అంబాల అభిలాష్, మహేష్, గణేష్,తేజ, అన్వేష్,తదితరులు పాల్గొన్నారు
