- సర్వాయి కోట అభివృద్ధి శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
సైదాపూర్/ధనాధన్ న్యూస్: సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను దేశానికి చాటి చెపుతామని,కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాయిపేట గ్రామంలోని సర్వాయి కోటను టూరిజం సర్కిల్ గా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
సైదాపూర్ మండలం సర్వాయిపేట గ్రామంలో రూ.4 కోట్ల 70 లక్షలతో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కోట పర్యాటక అభివృద్ధికి భూమి పూజ చేశారు.
సర్వాయిపేట కోటగుట్టపై సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు.
అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాబోయే తరాలు సర్దార్ పాపన్న తెలివి, ధైర్యం, తెగువను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. అరాచకానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి సామాజిక న్యాయం కోసం పోరాడిన సర్వాయి పాపన్న నేలనీ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఇక్కడి హనుమంతుని గుడి, మహమ్మదాపూర్ గుట్ట, మహాసముద్రం గండినీ అభివృద్ధి చేసి ఈ ప్రాంతాన్ని టూరిజం సర్కిల్ గా మారుస్తామని తెలిపారు. సర్వాయి కోట పనులు పూర్తయ్యాక ముఖ్యమంత్రితో ప్రారంభోత్సవం చేస్తామని, మరిన్ని నిధులతో మరో దశ అభివృద్ధినీ కొనసాగిస్తామని తెలిపారు. ఇక్కడి ప్రాంత ప్రజల జీవన స్థితిగతులను మరింత మెరుగుపరుస్తామని తెలిపారు.జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ టూరిజం శాఖ నుండి సర్వాయి పాపన్న కోట అభివృద్ధికి నాలుగు కోట్ల 70 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని అన్నారు.టూరిజం అభివృద్ధి అయితే చుట్టుపక్కల గ్రామాలు అభివృద్ధి చేందుతాయని తెలిపారు.
మోడల్ స్కూల్ అభివృద్ధికి రూ.60 లక్షలు
సైదాపూర్ లోని మోడల్ స్కూల్లో అభివృద్ధి పనులకు 60 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.శుక్రవారం మోడల్ స్కూల్ ని సందర్శించిన మంత్రి విద్యార్థులతో మాట్లాడారు. గతంలో వచ్చిన వరదను దృష్టితో ఉంచుకొని మోడల్ స్కూల్ కాంపౌండ్ వాల్ కోసం రూ.48 లక్షలు, వంట గది, టాయిలెట్ల నిర్మాణానికి రూ.12 లక్షలు మంజూరు చేస్తున్నామని అన్నారు. కరీంనగర్ జిల్లా యంత్రాంగం తరపున ఇప్పటికే విద్యార్థులందరికీ సులు పంపిణీ చేసినట్లు తెలిపారు. డైట్ చార్జీలు కాస్మోటిక్ చార్జీలు పెంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని హాస్టలలో కామన్ డైట్ మెనూ అమలు చేస్తున్నామని అన్నారు. విద్యార్థులు చదువుకొని వివిధ రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయి, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, సహకార సంఘం అధ్యక్షులు వెంకటరెడ్డి, తిరుపతి రెడ్డి, తెలంగాణ గౌడ్ సంఘం అధ్యక్షులు భువనగిరి యాదగిరి గౌడ్, బత్తిని శ్రీనివాస్ గౌడ్, బేరాల గోపాలరావు, ప్రభాకర్ రెడ్డి, సుధాకర్, రాజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండారపు శ్రీనివాస్ సహకార సంఘం అధ్యక్షుడు కొత్త తిరుపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కర్ణ గంటి మంజులారెడ్డి, హుస్నాబాద్ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
