జమ్మికుంట రైల్వే స్టేషన్ లో వ్యక్తి మృతి

By dhanadhannews.com

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట రైల్వే స్టేషన్ లో బీహార్ రాష్ట్రానికి చెందిన రైస్ మిల్ హమాలీ అనారోగ్యం తో మృతి చెందాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ జీ.తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం బీహార్ రాష్ట్రం నలంద జిల్లా పినిపర్ గ్రామానికి చెందిన దినేష్ యాదవ్(46) గత కొంతకాలంగా జమ్మికుంటలోని రైస్ మిల్ లో హమాలీగా పనిచేస్తూ ఉన్నాడు.తిరిగి ఊరికి వెళ్ళడానికి జమ్మికుంట రైల్వే స్టేషన్ కి వచ్చి బుకింగ్ కౌంటర్ లో పడుకొని చనిపోయి ఉన్నాడని, బహుశా అనారోగ్యం వలన గాని లేదా మరే ఇతర కారణం వల్ల గాని చనిపోయి ఉండవచ్చని తెలిపారు.రామగుండం రైల్వే స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.