జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే13:జమ్మికుంట మండలం తనుగుల గ్రామంలో ని మూల మలుపు వద్ద చెట్టును కారు ఢీ కొట్టిన ఘటన లో భార్యభర్తలకు తీవ్రగాయాలయ్యాయి.వరంగల్ నుండి కాల్వశ్రీరాంపూర్ మండలం బేగంపేటకు గ్రామానికి ఓటు వేయడానికి వెళుతున్న శ్రీనివాస్-రమ దంపతుల కారు తనుగుల గ్రామంలోని మూలమలుపు వద్ద చెట్టుని డీకొట్టింది.కారు లో ప్రయాణిస్తున్న భార్యభర్తలతో పాటు చిన్న పాప కి గాయాలయ్యాయి.ఆ సమయం లో వావిలాల నుండి పోలింగ్ కేంద్రాలను పరిశీలించి వస్తున్న హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వోడితల ప్రణవ్
ప్రమాదం లో గాయపడిన వారికి సహాయక చర్యలు అందించి 108 కాల్ చేసి అంబులెన్స్ లో బాధితులను మెరుగైన వైద్యం కోసం వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
