- పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన వొడితల ప్రణవ్

జమ్మికుంట, మార్చి20 : ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రెడ్డి సారంగం బిజెపి పార్టీకి రాజీనామా చేసి సిరిసేడు మాజీ ఎంపీటీసీ నేరెళ్ల కుమార్ ఆధ్వర్యంలో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో తీర్థం పుచ్చుకున్నారు.కాగా హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.ముదిరాజ్ సంఘ గౌరవ అధ్యక్షులు పుట్ట కుమారస్వామి, ఉపాధ్యక్షులు పుట్ట రాజు, మాజీ అధ్యక్షులు పుట్ట పద్మయ్య, పుట్ట చేరాలు, పుట్ట చంద్రమౌళి,పుట్ట సంపత్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రెడ్డి సారంగం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో,స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొందడానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరిగిద్ద మొగిలి, పరకాల విజయ్, కురిమిండ్ల చిరంజీవి పాల్గొన్నారు..