సైదాపూర్ మండలకేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం రోజున ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని రాష్ట్ర ఎంపీపీల పోరం రాష్ట్ర అధ్యక్షుడు సైదాపూర్ ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ ప్రజా పాలన సేవ కేంద్రం దరఖాస్తు చేసుకున్నవరు వారి దరఖాస్తులలో ఏమైనా తప్పులుంటే సవరణ చేసుకునే వెసులుబాటు ఉంటుందని, అలాగే గతంలో దరఖాస్తు చేసుకొని వారు కొత్తగా ప్రజాపాలన హెల్ప్ డెస్క్ లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో దూలం మంజుల,ఎంపీడీవో యాదగిరి, సూపర్డెంట్ ప్రేమ్ సాగర్,ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
