ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

By dhanadhannews.com

  • ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి

సైదాపూర్(ధనాధన్ న్యూస్)జూన్12:ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని అందుకోసం ప్రభుత్వాలు సకల సౌకర్యాలు అందిస్తున్నట్లు ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి తెలిపారు.విద్యా సంవత్సరం ప్రారంభ రోజును పురస్కరించుకుని మండల కేంద్రంలోని వెన్కెపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం రోజున ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా విద్యార్థులకు స్కూల్ యూనిఫాం లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ఆది నుండి నేటి వరకు నాణ్యమైన విద్యతో పాటు ఆన్ని రంగాలలో ఎదిగేలా మంచి విద్యను అందిస్తున్నాయని,దేశ,రాష్ట్ర రాజకీయాలలో ప్రముఖులతో పాటు చిరుద్యోగుల నుండి అత్యున్నత స్థాయి ఉద్యోగులంతా ప్రభుత్వ పాఠశాలలో  చదివి ప్రయోజకులు ఐనవారేననీ గుర్తు చేశారు.ప్రస్తుతం పాఠశాలల్లో ప్రభుత్వం మౌలిక వసతుల పాటు నాణ్యమైన ఉచిత విద్యతోపాటు మంచి భోజన సౌకర్యం,ఉచిత పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫాంలు అందడమే కాకుండా సమర్దవంతులైన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యాబోధన అందుతుందని,విశాల మైదానాలు కలిగి, విశాల గదులలో డిజిటల్ విద్యాబోధన అందిస్తున్నట్లు చెప్పారు.క్రీడా నైపుణ్య శిక్షణ ద్వారా మంచి క్రీడాకారులుగా రాణించవచ్చన్నారు.ఈ విద్యా సంవత్సరంలో మండలంలోని ఉన్నత పాఠశాలల్లో పదవ తరగతిలో అన్ని పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాలోనే ఏకైక మండలంగా నిలవడం హర్షణీయమన్నారు.అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి పూర్వ వైభవం తేవాలన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెరుగు దేవేందర్ రెడ్డి, సైదాపూర్ ఎంపీటీసీ సభ్యులు తొంట ఓదెలు,అమ్మ ఆదర్శ పాఠశాల ఛైర్మెన్ తలగంప మంజుల,ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనిల్ బాబు పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.