నేత్రదానంతో ఇద్దరికి చూపు

By dhanadhannews.com

  • కీ.శే.చిదురాల వెంకటయ్య చూపు సజీవం
  • అభినందించిన సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు
  • నేత్రాలను సేకరించిన ఎల్వీపీ టెక్నీషియన్ నరేందర్

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణానికి చెందిన చిదురాల వెంకటయ్య అనారోగ్యంతో  బుధవారం మృతి చెందడం జరిగింది.వారి సమీప బంధువు,సదాశయ ఫౌండేషన్ ప్రతినిధి అయిన డీలర్ గర్రెపల్లి వెంకటేశ్వర్లు వారికి నేత్రదానంపై అవగాహన కల్పించగా వారు ఒప్పుకోవడంతో,కరీంనగర్ జిల్లా సదాశయ ఫౌండేషన్ అధ్యక్షుడు నరహరి ఆధ్వర్యంలో,వరంగల్ ఎల్వీపీ టెక్నీషియన్ నరేందర్ సహకారంతో నేత్ర సేకరణ చేసి హైదరాబాద్ ఎల్వీపీ ఐ బ్యాంక్ కి పంపడం జరిగింది.ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించిన కుమారులు కోడండ్లు కృష్ణమూర్తి-రాధిక,భాస్కర్-జ్యోతిలకు,కూతుర్లు అల్లుండ్లు భాగ్యలక్ష్మి,(కీ.శే.రాజన్న),రమాదేవి సుధాకర్ కు,అవగాహన కల్పించిన డీలర్ వెంకన్నకు
సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి,ముఖ్య సలహాదారులు నూక రమేష్,గౌరవ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి,ప్రచార కార్యదర్శి వాసు,నరహరి,లగిశెట్టి చంద్రమౌళి, మరియు బంధుమిత్రులు అభినందనలు ధన్యవాదాలు తెలిపారు.