- రామనామస్మరణతో పులకించిన అపర భద్రాద్రి ఇల్లందకుంట
- పట్టు వస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
పట్టు సమర్పిస్తున్న కలెక్టర్ పమేలా సత్పతి.
జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 17:అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం గురువారం కమనీయం రమణీయంగా జరిగింది.సీతా రామచంద్రస్వామి ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి మేళ తాళాల మధ్య వేదపండితుల వేదమంత్రోచరణ మధ్య ఎదుర్కోళ్ల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.రాష్ట్ర ప్రభుత్వం తరఫున కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి దంపతులు, హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి పట్టు వస్త్రాలను ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.
ఆలయ ప్రధాన అర్చకులు శేషం రామాచార్యుల బృందం ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణాన్ని వేలాదిమంది భక్తులు తిలకిస్తుండగా శాస్త్ర యుక్తంగా ఘనంగా సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. కభిజిత్ లగ్నంలో జిలకర బెల్లం తంతు పూర్తి కాగానే అమ్మవారికి తాళిని అలంకరింప చేశారు.భక్తుల జయ జయ ద్వానాలు, రామనామ స్మరణ మధ్య తలంబ్రాల వేడుక అత్యంత వైభవంగా జరిగింది. సీతారాముల కల్యాణాన్ని వీక్షించేందుకై భారీ ఎల్ఈడి స్క్రీన్ లను ఏర్పాటు చేశారు.
వేలాదిమంది భక్తుల రామనామస్మరణల మధ్య ఆలయ ప్రాంగణం దద్దరిల్లింది. మండు టేoడలను సైతం లెక్కచేయకుండా సీతారాముల కళ్యాణాన్ని వీక్షించడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండే కాక దూర ప్రాంతాల నుండి వేలాదిమంది మంది భక్తులు తరలివచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ చేశారు.జమ్మికుంట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాదాపు 30 వేల మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం లోపల గర్భగుడిలోని సీతారాములను దర్శించుకునేందుకు భక్తులు భారీగా బారులు తీరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో కందుల సుధాకర్ అన్ని ఏర్పాట్లు హుజరాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి నేతృత్వంలో జమ్మికుంట సీఐ వరగంటి రవి జమ్మికుంట రూరల్ సీఐ కిషోర్ ఇల్లంతకుంట ఎస్సై రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దంపతులు,
ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు,బిఆర్ఎస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ దంపతులు,కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు,కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్,జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ,ఇల్లందకుంట ఎంపీపీ సరిగోమ్ముల పావని వెంకటేష్, ఇల్లందకుంట ఎంపీటీసీ దంసాని విజయ-కుమార్,ఇల్లందకుంట మాజీ సర్పంచ్ కంకణాల శ్రీలత సురేందర్ రెడ్డి,ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్,ఆర్డిఓ రమేష్ బాబు,ఈవో కందుల సుధాకర్ అన్ని పార్టీల నాయకులు, అధికారులు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
