బిస్లరీ వాటర్ ప్లాంట్ ను సందర్శించిన స్రవంతి జూనియర్ కళాశాల విద్యార్థులు

By dhanadhannews.com

  • విద్యార్థులకు సందేశాత్మక విజ్ఞానాన్ని అందించడమే లక్ష్యం
  • కరస్పాండెంట్ డాక్టర్ పుల్లూరి సంపత్ రావు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఆబాది జమ్మికుంట లోని బిస్లరీ వాటర్ ప్లాంట్ ను స్రవంతి జూనియర్ కళాశాల ప్రథమ సంవత్సర విద్యార్థులు మంగళవారం సందర్శించినట్లు కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ పుల్లూరి సంపత్ రావు తెలిపారు..ఈ సందర్భంగా కరస్పాండెంట్ డాక్టర్ పుల్లూరి సంపత్ రావు మాట్లాడుతూ బిస్లరీ వాటర్ ప్లాంట్  సందర్శించిన సందర్భంగా విద్యార్థులకు వాటర్ బాటిల్స్ తయారీ, ప్యాకేజింగ్ ప్రక్రియ గురించి తెలుసుకున్నారని తెలియజేశారు. కార్మికులు సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణంలో ఎలా పని చేస్తారో విద్యార్థులు పరిశీలించారని అన్నారు.మామూలు బోర్ వాటర్ నుండి వివిధ దశల ద్వారా పరిశోధన పరీక్షల ద్వారా శుద్ధిచేసి వాటర్ బాటిల్స్ లోకి మార్చే ప్రక్రియ విధానం తో పాటు వాటర్ బాటిల్స్ వాడడం ద్వారా కలిగే ప్రయోజనాలతో పాటు కాలి బాటిల్స్ ఎక్కువ రోజులు వాడడం ద్వారా ఏర్పడే చెడు అంశాల ను విద్యార్థులకు తెలియజేశారు..

వాటర్ ప్లాంట్ లో కార్మికుల కంటే ఎక్కువగా యంత్రాల పనిచేస్తున్నాయని, భవిష్యత్తులో శ్రామిక శక్తి కంటే యాంత్రిక శక్తితోనే ఎక్కువ వస్తువులు ఉత్పత్తి అవుతాయని విద్యార్థులకు సూచించారు..పట్టణ ప్రాంతాల నుండి గ్రామీణ ప్రాంతాలకు కూడా వాటర్ బాటిల్స్ ఎలా వ్యాప్తి చెందయో భవిష్యత్ లో నీటి వినియోగం ఎలా ఉండబోతుందో విద్యార్థులకు వివరించారు..ఈ వాటర్ ప్లాంట్ సందర్శన విద్యార్థుల కు  సందేశాత్మక, ఆసక్తికరమైన విజ్ఞానాన్ని అందించిందని విద్యార్థులు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్రవంతి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నడిపెల్లి శ్రీనివాసరావు,డైరెక్టర్లు కొండ విజయ్,రహమాన్,అధ్యాపకులు దేవేందర్ రావు,దొరబాబు,సమ్మయ్య,కిషన్,కుమార్,శ్రావణి,విద్యార్థులు పాల్గొన్నారు..