బీసీ బిడ్డ ఈశ్వరమ్మ యాదవ్‌పై చేసిన వ్యాఖ్యలకు శివచరణ్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి: దొంతరవేన రమేష్ యాదవ్

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యురాలిగా నియమితులైన బీసీ మహిళ పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్‌పై యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉప సర్పంచ్‌ల ఫోరం జమ్మికుంట మండల అధ్యక్షుడు దొంతరవేన రమేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీసీ మహిళను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరమని అన్నారు. జక్కిడి శివచరణ్ రెడ్డి వెంటనే పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్‌కు, యాదవ జాతికి, […]

మడిపెల్లి హత్య కేసు ఛేదించిన పోలీసులు..నిందితుడి అరెస్ట్

జమ్మికుంట,జూన్ 29 (ధనాధన్ న్యూస్): మడిపెల్లి గ్రామంలో ఇటీవల జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం మడిపెల్లి గ్రామానికి చెందిన గంగారపు మహేష్ (40)ను అదుపులోకి తీసుకుని విచారించగా, కేసుకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.జమ్మికుంట పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హుజురాబాద్ ఏసిపి మాధవి తెలిపిన వివరాల ప్రకారం,తన వ్యవసాయ భూమి సమీపంలో కౌలుకు వ్యవసాయం చేస్తున్న ఓ వివాహిత […]

జమ్మికుంటలో ఘనంగా హరీష్ రావు జన్మదిన వేడుకలు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్,జూన్ 3: తెలంగాణ ఉద్యమ యోధుడు, రైతు బాంధవుడు, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో టి హెచ్ ఆర్ టీం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సమీపంలోని శివాలయం (బొమ్మల గుడి)లో అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. టి హెచ్ ఆర్ టీం రాష్ట్ర కమిటీ మరియు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు హరీష్ వర్మ అప్పని […]

హుజురాబాద్‌లో ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్ నాయకులకు అవగాహన కార్యక్రమం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్,మే 29:కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్‌ఐఆర్ (SIR) అంశంపై గ్రామ గ్రామాన ప్రజలకు అవగాహన కల్పించాలని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎస్‌ఐఆర్ సమన్వయకర్త, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ఎస్‌ఐఆర్ అవగాహన కార్యక్రమం హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో […]

అదనపు కట్నం కోసం వేధింపులు.. నలుగురిపై కేసు నమోదు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్ మే 10: అదనపు కట్నం తీసుకురావాలని కోడలిని వేధించిన భర్తతో పాటు అత్తమామలు, బంధువులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మడిపల్లి గ్రామానికి చెందిన ఇగ్గేటి అనూష (26)కు గత ఏడాది ఉల్లంపల్లి గ్రామానికి చెందిన బుల్లి అజయ్‌కుమార్‌తో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వివాహ సమయంలో వధువు కుటుంబ సభ్యులు ఎకరం భూమి, రూ.8 లక్షల నగదు, ఇతర లాంఛనాలతో ఘనంగా పెళ్లి జరిపించినట్లు తెలిపారు. పెళ్లి […]

గడ్డం సమ్మయ్య కి దళిత రత్న అవార్డు

హుజూరాబాద్/ధనాధన్ న్యూస్: హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా దళిత రత్న అవార్డు ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించబడింది.మహనీయులు బాబు జగజీవన్ రామ్ మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ బైరి వెంకటేశం ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఎస్సీ 52 కులాల సంఘం అధ్యక్షుడు రైళ్ల లక్ష్మీ నరసయ్య కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా హుజురాబాద్ ఇందిరానగర్‌కు చెందిన […]

వావిలాల గ్రామంలో వ్యక్తి మృతి.. కారణాలపై పోలీసుల విచారణ

వావిలాల: గ్రామానికి చెందిన రాగల సాంబయ్య (55) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.సాంబయ్యకు ఇద్దరు కుమారులు ఉండగా, చిన్న కుమారుడు రాగల వంశీ (26) హైదరాబాద్‌లో స్వంత కారును అద్దెకు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఏడాది క్రితం అతని తల్లి అనారోగ్యంతో మృతి చెందగా, అప్పటి నుంచి సాంబయ్య తన పెద్ద కుమారుడు నాగరాజుతో కలిసి […]

హుజురాబాద్ డివిజన్‌లో చీటింగ్ కేసులపై సీపీ సమీక్ష

కరీంనగర్/ధనాధన్ న్యూస్, ఏప్రిల్ 29:కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం బుధవారం హుజురాబాద్ ఏసీపీ కార్యాలయంలో డివిజన్ స్థాయి పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న నేరాల విచారణ తీరును సమగ్రంగా పరిశీలించారు. ముఖ్యంగా చీటింగ్ (మోసం) మరియు ఫోర్జరీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించిన సీపీ, అమాయక ప్రజలను మోసం చేసే నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసులను […]

జమ్మికుంట బీజేపీ ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షుడిగా పుల్లూరి ప్రశాంత్ నియామకం

జమ్మికుంట/ధనధాన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షుడిగా పుల్లూరి ప్రశాంత్‌ను నియమించారు. ఈ నియామకం పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ప్రశాంత్ మాట్లాడుతూ, వార్డ్ బూత్ అధ్యక్షుడిగా పనిచేసిన తనను పట్టణ అధ్యక్షుడిగా ఎంపిక చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన జిల్లా అధ్యక్షుడు కృష్ణరెడ్డి, పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు, […]

కల్వరి టెంపుల్‌లో ఘనంగా ఈస్టర్ వేడుకలు

హుజూరాబాద్/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్ మండలంలోని రంగాపూర్ గ్రామంలో ఉన్న కల్వరి టెంపుల్‌లో ఈస్టర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక సంఘ కాపరి పాస్టర్ నెల్సన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ వేడుకలను భక్తిశ్రద్ధలతో జరిపారు.ఈస్టర్ పర్వదినం సందర్భంగా, గుడ్ ఫ్రైడే నాడు యేసు క్రీస్తు శిలువపై మరణించి, ఆదివారం తిరిగి లేచిన దినాన్ని పునరుత్థాన ఈస్టర్‌గా భావిస్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో సభాధ్యక్షుడిగా బండ రమేష్ వ్యవహరించి కార్యక్రమాన్ని సమర్థంగా […]