మల్లాపూర్‌లో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 9: కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మంగళవారం మల్లాపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మండలానికి చెందిన 89 మంది లబ్ధిదారులకు రూ.89,10,324 విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ, పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భారం తగ్గించాలనే లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. ఈ […]
అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

బుగ్గారం/ధనాధన్ న్యూస్ జూన్ 9:జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రానికి చెందిన కౌలు రైతు, దళిత రైతు మానాల పెద్ద దుబ్బయ్య (60) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. కౌలుకు తీసుకున్న పొలాల సమీపంలోనే ఆయన మృతదేహం లభించింది. కుటుంబ సభ్యులు, బుగ్గారం ఎస్సై జి. సతీష్ తెలిపిన వివరాల ప్రకారం, పెద్ద దుబ్బయ్య పలువురు రైతుల భూములను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. అయితే ఇటీవల […]
నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకెట్ హాల్ నిర్మాణం

మెట్‌పల్లి/ధనాధన్ న్యూస్,జూన్ 8: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని 63వ జాతీయ రహదారిని ఆనుకుని నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకెట్ హాల్ నిర్మాణం జరుగుతోందని ఆరోపిస్తూ, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని వంకాయల ముఖేష్ చంద్ర జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, జాతీయ రహదారి పక్కనే ఎలాంటి షెడ్‌బ్యాక్ లేకుండా బ్యాంకెట్ హాల్ నిర్మాణ పనులు చేపడుతున్నారని తెలిపారు. నిర్మాణ స్థలం పక్కగా, […]
మృగశిర కార్తె సందర్భంగా ఉచిత ఆయుర్వేద మందు పంపిణీ

జగిత్యాల/ధనాధన్ న్యూస్ జూన్ 8: జిల్లా కేంద్రంలోని చింతకుంట చెరువు సమీపంలో ఉన్న శ్రీ సూర్య భగవాన్ ధన్వంతరి ఆలయంలో మృగశిర కార్తె సందర్భంగా భక్తులకు మృగశిర ఆయుర్వేద ఔషధాన్ని ఉచితంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, మృగశిర కార్తె రోజున ఈ ఔషధాన్ని సేవించడం వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, జలుబు, దగ్గు, ఆస్తమా, ఈసినోఫిలియా తదితర అలర్జీ సమస్యల నుంచి ఉపశమనం లభించడమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. […]
అంతర్గాంలో మహిళలకు ఉచిత ఆటో ప్రయాణ సేవ ప్రారంభం

జగిత్యాల/ధనాధన్ న్యూస్ జూన్ 8: జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామంలో సర్పంచ్ కంటెస్టెడ్ అభ్యర్థి కోల భవాని-అరుణ్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మహిళల కోసం ఉచిత ఆటో ప్రయాణ సేవను సోమవారం ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మహిళలకు ఉచిత ఆటో ప్రయాణ సేవను ప్రారంభించి మాట్లాడారు. మహిళల సంక్షేమం, సౌకర్యాల కల్పనకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మహిళల […]
జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజుల్లో 50 శాతం రాయితీ కల్పించాలి

జగిత్యాల/ధనాధన్ న్యూస్ జూన్ 8: జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50 శాతం ఫీజు రాయితీ కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ జర్నలిస్టుల ప్రతినిధులు సోమవారం జిల్లా అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజానికి సమాచారాన్ని అందిస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అయితే తక్కువ ఆదాయంతో పనిచేస్తున్న పలువురు జర్నలిస్టులు తమ పిల్లల విద్యా ఖర్చులను భరించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. […]
