
మల్యాల/ధనాధన్ న్యూస్, జూన్ 27: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు చేపట్టిన 40 రోజుల కార్యాచరణలో భాగమైన “గో టు విలేజ్ – మాదిగ పల్లెలకు తరలండి” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెస్పీ-ఎంఆర్పీఎస్ జగిత్యాల జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్ మాదిగ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నాయకులు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా మల్యాల మండల నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షుడు దుమాల గంగారాం మాదిగ మాట్లాడుతూ, ఎస్సీల వర్గీకరణ కోసం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 30 ఏళ్లపాటు సాగిన ఉద్యమ ఫలితంగానే వర్గీకరణ సాధ్యమైందన్నారు.
ఆ వర్గీకరణ ఫలాలు మాదిగ జాతి యువత, విద్యార్థులు, నిరుద్యోగులకు అందేలా గ్రామస్థాయిలో చైతన్యం కల్పించేందుకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఇచ్చిన కార్యాచరణలో భాగంగా మే 25, 2026 నుంచి జూలై 5 వరకు “గో టు విలేజ్ – మాదిగ పల్లెలకు తరలండి” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో విజయవంతం చేయాలని కోరారు.అదేవిధంగా అన్ని మండలాల్లో గ్రామ కమిటీల నిర్మాణాన్ని పూర్తి చేయాలని, ఇంకా కమిటీలు ఏర్పాటు కాని గ్రామాల్లో ఎంఆర్పీఎస్, ఎమ్మెస్పీ అనుబంధ సంఘాల గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ఎంఆర్పీఎస్ గద్దెలు లేని గ్రామాల్లో నూతన గద్దెల నిర్మాణం చేపట్టాలని తెలిపారు.
జూలై 7న ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంస్థ 32వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ప్రతి గ్రామంలో ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణతో పాటు ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
మల్యాల మండల నూతన కమిటీ:
కన్వీనర్‌గా మారంపల్లి గంగాధర్ మాదిగ
కో-కన్వీనర్‌గా బెజ్జంకి దుర్గయ్య మాదిగ
కో-కన్వీనర్‌గా తెడ్డు శ్రీనివాస్ మాదిగలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల నియోజకవర్గ కో-కన్వీనర్ పొడేటి సునీల్ మాదిగ, గుడిసె రవి మాదిగ, మడుగుల వెంకటస్వామి, మారంపల్లి గంగాధర్ మాదిగ, తెడ్డు శ్రీనివాస్, శనిగరపు తిరుపతి మాదిగ, నక్క రాజయ్య మాదిగ, ముప్పరపు రవీందర్ మాదిగ, బెజ్జంకి బుజ్జన్న, గుర్రపు లక్ష్మణ్, తొడేటి బాబు, మునుగురి అజయ్, దాసరి జలపతి, దొనకొండ కాంతయ్య, తాళ్ల హరినాథ్, మల్యాల శేఖర్, నల్లాల సాయికిరణ్, నక్క గంగాధర్, లింగంపల్లి నర్సయ్య, చిర్ర శేఖర్, చిర్ర రెడ్డి మాదిగ, మునుగురి రమేశ్ మాదిగ, దొనకొండ నవీన్, తుంగపెల్లి మోహన్, సైదల అంజయ్య, సిద్ధెంకి లింగయ్య, తుంగపెల్లి గంగారెడ్డి మాదిగ, చెవులమద్ది మల్లయ్య, నలువాల సాయికిరణ్, నలువాల సంజీవ్, మారంపల్లి లక్ష్మణ్, మల్యాల నారాయణ, తైదాల సతీష్ తదితరులు పాల్గొన్నారు.