అంతర్గాంలో మహిళలకు ఉచిత ఆటో ప్రయాణ సేవ ప్రారంభం

జగిత్యాల/ధనాధన్ న్యూస్ జూన్ 8: జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామంలో సర్పంచ్ కంటెస్టెడ్ అభ్యర్థి కోల భవాని-అరుణ్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మహిళల కోసం ఉచిత ఆటో ప్రయాణ సేవను సోమవారం ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మహిళలకు ఉచిత ఆటో ప్రయాణ సేవను ప్రారంభించి మాట్లాడారు. మహిళల సంక్షేమం, సౌకర్యాల కల్పనకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మహిళల […]
తెలంగాణ ఉద్యమకారుడు పులిగారి చంద్రశేఖర్ రెడ్డికి ఘన నివాళి

వికారాబాద్/ధనాధన్ న్యూస్ జూన్ 8: తెలంగాణ ఉద్యమకారుడు, వికాస్ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ దివంగత పులిగారి చంద్రశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా సోమవారం వికాస్ జూనియర్ కళాశాల ఆవరణలో ఘనంగా నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి తెలంగాణ ఉద్యమకారులు, కళాశాల సిబ్బంది, మున్నూరు సోమారం గ్రామ నాయకులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పులిగారి చంద్రశేఖర్ రెడ్డి చేసిన సేవలను స్మరించుకున్నారు. సమాజ సేవతో పాటు విద్యా రంగ […]
జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజుల్లో 50 శాతం రాయితీ కల్పించాలి

జగిత్యాల/ధనాధన్ న్యూస్ జూన్ 8: జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50 శాతం ఫీజు రాయితీ కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ జర్నలిస్టుల ప్రతినిధులు సోమవారం జిల్లా అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజానికి సమాచారాన్ని అందిస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అయితే తక్కువ ఆదాయంతో పనిచేస్తున్న పలువురు జర్నలిస్టులు తమ పిల్లల విద్యా ఖర్చులను భరించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. […]
విలేకరిని బెదిరించిన వారిపై కేసు నమోదు

భూపాలపల్లి,జూన్ 7 (ధనాధన్ న్యూస్):జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలానికి చెందిన జర్నలిస్టు ఇప్పకాయల సాగర్‌ను దూషించి, ప్రాణహాని కలిగిస్తామని బెదిరించిన ఘటనలో రాయపల్లి గ్రామ సర్పంచ్ తాడం తిరుపతి, అంకం రాజేందర్‌లపై రేగొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.వివరాల్లోకి వెళ్తే, రాయపల్లి గ్రామ సమీపంలోని ప్రభుత్వ భూముల నుంచి అక్రమంగా మట్టి తరలింపుపై జర్నలిస్టు ఇప్పకాయల సాగర్ వార్త ప్రచురించారు. దీంతో ఆగ్రహించిన సదరు వ్యక్తులు ఫోన్ ద్వారా దూషిస్తూ, చంపుతామని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. […]
దివంగత మిత్రుని కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం

హుస్నాబాద్/ధనాధన్ న్యూస్,జూన్ 7: స్నేహం అంటే కేవలం కలిసి చదవడం, కలుసుకోవడం మాత్రమే కాదని, కష్టకాలంలో ఒకరికొకరు అండగా నిలవడమేనని హుస్నాబాద్ గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థులు మరోసారి నిరూపించారు.సైదాపూర్ మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందిన బొడిగ తిరుపతి గత నెల 24న అనారోగ్యంతో అకాల మరణం చెందగా,ఆయన కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు తోటి పూర్వ విద్యార్థులు ముందుకొచ్చారు.1996–2016 మధ్య హుస్నాబాద్ గురుకుల పాఠశాలలో తిరుపతితో కలిసి చదువుకున్న స్నేహితులు నిజాం కళాశాల ప్రొఫెసర్ వేల్పుల […]
ప్రజా భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం

వికారాబాద్/ధనాధన్ న్యూస్,జూన్ 06: వికారాబాద్ పట్టణంలోని అనంతగిరిపల్లి 10వ వార్డులో నిర్వహించిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. మున్సిపాలిటీ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో ప్రజల భాగస్వామ్యాన్ని నిర్ధారించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.వార్డు సభల ద్వారా స్థానిక సమస్యలను గుర్తించడం, అభివృద్ధి పనులను సూచించడం, సమగ్ర వార్డు అభివృద్ధి ప్రణాళిక రూపొందించడంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం […]
తెలంగాణ భూములను దోచుకునే కుట్ర జరుగుతోంది: కల్వకుంట్ల కవిత

హైదరాబాద్/ధనాధన్ న్యూస్,జూన్ 06: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్రంలో భారీ స్థాయిలో భూదందాలు జరుగుతున్నాయని ఆరోపించారు. శనివారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల విలువైన భూములను బడాబాబులకు అప్పగించే కుట్ర చేస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు భూదందాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, ఇందుకు సంబంధించిన ఆధారాలను దశలవారీగా ప్రజల ముందుకు తీసుకువస్తానని తెలిపారు. తెలంగాణ భూములు, […]
సర్వేకు రేటు కట్టిన సర్వేయర్‌కు ఏసీబీ షాక్

సైదాపూర్/ధనాధన్ న్యూస్ జూన్ 5:మరో అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. భూమి సర్వే నిర్వహించేందుకు రైతు నుంచి లంచం డిమాండ్ చేసిన మండల సర్వేయర్‌ను ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సర్వేయర్‌తో పాటు ఇద్దరు సహాయకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్ గ్రామానికి చెందిన రైతు చుంచు మహేందర్‌కు సైదాపూర్ మండలం అమ్మనగుర్తి గ్రామ శివారులో మూడు ఎకరాల భూమి […]
ఎండదెబ్బతో గొర్రెల కాపరి మృతి

సైదాపూర్/ధనాధన్ న్యూస్ జూన్ 5: మండలంలోని పెర్కపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు ఎండదెబ్బ తగిలి మృతి చెందిన ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పిల్లి శ్రీశైలం (29) గురువారం ఉదయం గొర్రెలను మేపేందుకు వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో తీవ్ర ఎండ ప్రభావంతో తల తిరగడం, వాంతులు, విరేచనాలు అవుతున్నాయని తన తండ్రి పిల్లి తిరుపతికి ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. దీంతో తిరుపతి గ్రామానికి చెందిన […]
మరమ్మతులకు నోచుకోని తుమ్మలచెరువు కట్టు కాలువ

సైదాపూర్/ధనాధన్ న్యూస్ జూన్ 4: సైదాపూర్ మండలంలోని తుమ్మలచెరువు కట్టు కాలువ గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు రెండు చోట్ల దెబ్బతిన్నప్పటికీ ఇప్పటివరకు మరమ్మతులకు నోచుకోలేదని వెంకేపల్లి గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు మునుపాల శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రానున్న వర్షాకాలానికి ముందే చెరువు కట్టు కాలువకు మరమ్మతులు చేపట్టకపోతే భారీ నష్టం సంభవించే ప్రమాదం ఉందన్నారు. మరోసారి భారీ వర్షాలు కురిస్తే తుమ్మలచెరువు కట్ట పూర్తిగా […]
