అడవుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి:అటవీశాఖ అధికారులు

సైదాపూర్/ధనాధన్ న్యూస్,జూన్ 18 (ప్రతినిధి):వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్ గ్రామంలోని అటవీ భూమిలో గురువారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీశాఖ ఉన్నతాధికారులు అడవుల ఆవశ్యకత, మొక్కల పెంపకం ప్రాధాన్యత, వాటి సంరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ పలు సూచనలు, సలహాలు అందించారు. అలాగే రాయికల్ అటవీ ప్రాంతంలో ఉన్న రాయికల్ జలపాతాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాయికల్ […]

విద్యను వ్యాపారంగా మారుస్తున్న శ్రీ చైతన్య పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

కరీంనగర్/ధనాధన్ న్యూస్,జూన్ 18: కరీంనగర్ నగరంలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలల యజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల పేరుతో పుస్తకాలు అమ్ముతూ విద్యను వ్యాపారంగా మారుస్తున్నారని శ్రీ చైతన్య పాఠశాలలో విజ్ఞాన కేంద్రాలుగా కాకుండా వ్యాపార కేంద్రాలుగా మారాయని శ్రీ చైతన్య పాఠశాలలు నిబంధనలు పాటించకపోతే ఆ పాఠశాలలపై ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భౌతిక దాడులు చేస్తామని ఒక్క రూపాయి ఎక్కువ ఫీజులు వసూలు చేసిన ఊరుకునేది లేదని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్ హెచ్చరించారు. గురువారం  […]

ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నాం

జగిత్యాల/ధనాధన్ న్యూస్, జూన్ 17:ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజల స్వంతింటి కల నెరవేర్చుతున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.కొండాపూర్ గ్రామానికి మంజూరైన ఇందిరమ్మ ఇళ్లలో  9 ఇళ్ల పూర్తి కాగా బుధవారం గృహ ప్రవేశాలు నిర్వహించారు. గృహప్రవేశ వేడుకలకు హాజరైన మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో […]

నాడు కరీంనగర్ లో..నేడు ధర్మపురిలో

జగిత్యాల/ధనాధన్ న్యూస్, జూన్ 17:(చుక్క గంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ – జగిత్యాల): గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కల్యాణ లక్ష్మి చెక్కులు, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల కొరకు లబిద్దారులు కరీంనగర్ వెళ్లే పరిస్థితి ఉండేదని నేడు ప్రజా ప్రభుత్వంలో ధర్మపురి నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లోనే లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో నలుగురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి […]

మాల సంక్షేమ సంఘం సర్వాయిపేట గ్రామ పంచాయతీ అధ్యక్షుడిగా దొంత హరీష్ ఏకగ్రీవ ఎన్నిక

సైదాపూర్/ధనాధన్ న్యూస్,జూన్ 14: సైదాపూర్ మండలంలోని సర్వాయిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వాయిపేట, శివరాంపల్లి జంట గ్రామాల మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా దొంత హరీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘ సభ్యులు, పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.సంఘ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని, మాల సంఘం సంక్షేమం, ఐక్యత, పురోగతి కోసం నిరంతరం పనిచేస్తానని హరీష్ పేర్కొన్నారు. సంఘ సభ్యులందరి సహకారంతో గ్రామాల్లో సామాజిక, […]

ఆకునూరు పాఠశాలలో స్వచ్ఛ పాఠశాల – స్వచ్ఛ భారత్ కార్యక్రమం

సైదాపూర్/ధనాధన్ న్యూస్,జూన్ 13: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సైదాపూర్ మండలంలోని ఆకునూరు ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం “స్వచ్ఛ పాఠశాల – స్వచ్ఛ భారత్” కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా హుస్నాబాద్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ గుర్రాల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పాఠశాల ఆవరణ, తరగతి గదులు, డ్రైనేజీలను శుభ్రపరిచి, చెత్తాచెదారం, కలుపు మొక్కలను తొలగించినట్లు పేర్కొన్నారు. […]

అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

బుగ్గారం/ధనాధన్ న్యూస్ జూన్ 9:జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రానికి చెందిన కౌలు రైతు, దళిత రైతు మానాల పెద్ద దుబ్బయ్య (60) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. కౌలుకు తీసుకున్న పొలాల సమీపంలోనే ఆయన మృతదేహం లభించింది. కుటుంబ సభ్యులు, బుగ్గారం ఎస్సై జి. సతీష్ తెలిపిన వివరాల ప్రకారం, పెద్ద దుబ్బయ్య పలువురు రైతుల భూములను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. అయితే ఇటీవల […]

మృగశిర కార్తిలో చేపల కోసం నిరీక్షణ.. నిరాశతో వెనుదిరిగిన ప్రజలు

సైదాపూర్/ధనాధన్ న్యూస్ జూన్ 8: సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో మృగశిర కార్తి సందర్భంగా సోమవారం గ్రామ చెరువులో చేపల వేట నిర్వహించారు. చేపలు లభిస్తాయనే ఆశతో ఆకునూరు గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు చెరువు వద్దకు తరలివచ్చారు. అయితే ఆశించిన మేర చేపలు దొరకకపోవడంతో దాదాపు 500 మందికి పైగా ప్రజలు నిరాశతో, ఆగ్రహంతో వెనుదిరిగారు.ప్రజలు మాట్లాడుతూ ఉదయం నుంచే చెరువు వద్ద వేచి ఉన్నప్పటికీ సాయంత్రం నాలుగు గంటల […]

గ్యాస్ ధరల పెంపుపై కాంగ్రెస్ ఆగ్రహం – కరీంనగర్‌లో వంటా-వార్పు

కరీంనగర్/ధనాధన్ న్యూస్ జూన్ 8: కేంద్రంలోని ఎన్డీఏ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల ఎల్‌పీజీ గ్యాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ నగరంలోని ఇందిరా చౌక్ వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఖాళీ గ్యాస్ సిలిండర్లు, బీజేపీ వ్యతిరేక నినాదాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ కట్టెల పొయ్యిపై వంట చేస్తూ కాంగ్రెస్ నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి […]

మృగశిర కార్తె సందర్భంగా ఉచిత ఆయుర్వేద మందు పంపిణీ

జగిత్యాల/ధనాధన్ న్యూస్ జూన్ 8: జిల్లా కేంద్రంలోని చింతకుంట చెరువు సమీపంలో ఉన్న శ్రీ సూర్య భగవాన్ ధన్వంతరి ఆలయంలో మృగశిర కార్తె సందర్భంగా భక్తులకు మృగశిర ఆయుర్వేద ఔషధాన్ని ఉచితంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, మృగశిర కార్తె రోజున ఈ ఔషధాన్ని సేవించడం వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, జలుబు, దగ్గు, ఆస్తమా, ఈసినోఫిలియా తదితర అలర్జీ సమస్యల నుంచి ఉపశమనం లభించడమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. […]