చనిపోయిన కౌలు రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

  • కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

బుగ్గారం/ధనాధన్ న్యూస్, జూన్ 27(చుక్క గంగారెడ్డి,సీనియర్ జర్నలిస్ట్): జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రానికి చెందిన ఆత్మహత్య చేసుకున్న దళిత కౌలు రైతు మానాల పెద్ద దుబ్బయ్య (60) కుటుంబాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం పరామర్శించారు.మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుని తగిన న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తన వ్యక్తిగతంగా రూ.5,000 తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు.రైతులు ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడడం అత్యంత బాధాకరమని ఆయన అన్నారు. కౌలు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుని, వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a comment