ప్రతి పథకం ప్రజలకు చేరడమే ప్రభుత్వ ధ్యేయం

  • మంత్రి పొన్నం ప్రభాకర్

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండల కేంద్రంలో రైతువేదికలో  అగ్రికల్చర్ ఆఫీసర్ వైదేహి అధ్యక్షతన నిర్వహించిన వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో
ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వివిధ విభాగాల అధికారులు
రైతులు పెట్టుబడి తక్కువగా ఉండి
అధిక ఆదాయం వచ్చే పంటలపై దృష్టి సారించాలని, పాడి పశువుల పోషణ,చేపలు పెంపకం,పండ్ల, గొర్రెలు,నాటు కోళ్లు,తోటలు,ఆయిల్ ఫాం,డ్రాగన్ ఫ్రూట్,పట్టు పరిశ్రమపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని,రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తుందని,ఇప్పటికే లక్ష 50 వేల వరకు రుణమాఫీ చేసిందని తెలిపారు.సైదాపూర్ మండలంలో ఇప్పటివరకు 2003 మంది రైతులు 12 కోట్ల 61 లక్షలు మొదటి విడతలో మాఫీ అయినాయని,రెండో విడత రుణమాఫీలో 1517 రైతులకు 10 కోట్ల 11 లక్షలు  రూపాయలు మాఫీ అయినట్లు తెలిపారు.మొత్తం రుణమాఫీ 22 కోట్ల 40 లక్షల రూపాయలు రుణమాఫీ అయినట్లు తెలిపారు.ఎవరికైనా సాంకేతిక సమస్యల వల్ల రుణమాఫీ రాకపోతే వ్యవసాయ అధికారులకు వివరాలు సమర్పించండని తెలిపారు.అర్హత ఉన్న ప్రతి రైతుకూ రుణమాఫీ వస్తుందని తెలిపారు.
200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 కి గ్యాస్ రాని వారు మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ లో వివరాలు సమర్పించాలని తెలిపారు.వ్యవసాయంలో సంప్రదాయ పంటల వల్ల పెరుగుతున్న ఖర్చు ఆదాయం తక్కువగా ఉంటుందని,ఖర్చు తక్కువగా ఉండి ఆదాయం అధికంగా వచ్చే పంటలపై అధికారులు సూచించే పథకాలు ఉపయోగించుకొని లాభార్జన పొందాలని హుస్నాబాద్ నియోజకవర్గం వ్యవసాయ రంగంలో ఆదర్శంగా ఉండాలని రైతులకు కోరారు.బ్యాంకర్లతో మాట్లాడి లోన్ విషయంలో మీ సమస్య పరిష్కారం చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఆఫీసర్ వైదేహి,ఆర్టీవో  రమేష్,ఎమ్మార్వో దూలం మంజుల,ఎంపీడీవో యాదగిరి,పశువైద్య అధికారి సిహెచ్ విజేందర్,ఆర్ఐ శరత్ కుమార్,ఏఈఓ వంశీ,ఏఈఓ నిఖిల్ కుమార్,అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.