రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వ అండదండలు (ఆశీస్సులు) కరువు

By dhanadhannews.com

  • పరమశివుని ఆశీస్సులు రైతంగంపై ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన తన్నీరు హరీష్ రావు టీం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు హరీష్ వర్మ అప్పని

1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆబాది జమ్మికుంట మహాలింగేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ రైతులకు సకాలంలో నీళ్లు రాక పంట పొలాలు ఎండుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం రైతులపై కన్నేర చేస్తూ రైతులను విస్మరిస్తూ పరిపాలన కొనసాగిస్తుందని రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం రైతు వ్యతిరేక విధివిధానాలను నిర్వహిస్తూ రైతుకి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ  రైతంగాన్ని నడ్డి విరిచే చర్యలు చేపడుతూ రైతుల కళ్ళల్లో కన్నీళ్లను నింపుతూ పరిపాలన కొనసాగిస్తుందని ఆ పరమశివుడి ఆశీస్సులతో భవిష్యత్తులో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులకు ఊరట ఇస్తూ రైతులకు అండగా ఆ పరమశివుని ఆశీస్సులు ఉండాలని మహా లింగేశ్వర స్వామిని వేడుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో తన్నీరు హరీష్ రావు టీం సభ్యులు యార సుమన్,అజయ్,దినేష్ ముఖేష్ నరేష్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.