ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు

By dhanadhannews.com

  • హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ,మానసిక వికలాంగుల పాఠశాలలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు
  • స్వయంగా ఇంటింటికీ వెళ్లి సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ప్రణవ్
  • కష్టకాలంలో అండగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు
  • దమ్మున్న సీఎం రేవంత్ రెడ్డి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.హుజురాబాద్ పట్టణంలో నిర్వహించిన జన్మదిన వేడుకలకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ హాజరయ్యారు.ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేసిన,అనంతరం జమ్మికుంట పట్టణంలోని సత్యసాయి మానసిక వికలాంగుల పాఠశాలలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసిన వ్యక్తి సిఎం రేవంత్ రెడ్డి అని,దేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి సమగ్ర కులగణ సర్వేను నిర్వహించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని,ఆరు గ్యారంటీల అమలు ద్వారా ప్రజలకు మరింత చేరువై,సేవ చేస్తూ దమ్మున్న నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు.అలాగే ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా హుజురాబాద్ మండలంలోని పలు గ్రామాలలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను నేరుగా లబ్దిదారుల ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు.కష్టకాలంలో మాకు అండగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు.