దళిత బందు ఇచ్చేది పక్కా కాంగ్రెస్ ప్రభుత్వమే

By dhanadhannews.com

  • దళిత బందు ఆపింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమే.
  • ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసింది అంతా చేసి ఇప్పుడు దళితులపై కపట ప్రేమ చూపిస్తుండు.

హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో “దళిత బంధు” రెండో విడత అమలును ఆపింది అప్పటి బీఆర్ఎస్ సర్కార్,అప్పటి ఎమ్మెల్సీ,ప్రస్తుత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. గురువారం జమ్మికుంట పట్టణంలోని  ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాతకాల అనిల్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ “దళిత బందు” సాధన కమిటీ నాయకుల ప్రకటనల వల్ల దళిత బంద్ లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారని,కాంగ్రెస్ ప్రభుత్వంను బద్నామ్ చేయాలనే ఒకే ఒక ఎజెండాగా పెట్టుకొని దళిత బంద్ సాధన సమితి పేరుతో వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు.దానివల్ల మా దళితులకు నష్టమే తప్ప లాభం జరిగేది లేదని,కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిండు అసెంబ్లీలో దళిత బంధు కచ్చితంగా లబ్ధిదారులకు అందజేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారని గుర్తు చేశారు.ఒకసారి మాట ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ మాట తప్పదని తెలిపారు.దళిత బంధు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.సీఎం రేవంత్,డిప్యూటీ సీఎం భ ట్టి,జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్,నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ బాబు,టిపిసిసి మెంబర్ పత్తి కిష్ణారెడ్డి ల నాయకత్వంలో రెండో విడత  “దళిత బంధు”ఇస్తామని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాతకాల అనిల్,దొడ్డే నవీన్,శ్రీకాంత్, అశోక్,అనిల్,సురేష్, రమేష్,దిలీప్,సాగర్,సాయికిరణ్,రమేశ్ తదితరులు పాల్గొన్నారు.