- తెలంగాణలో మొట్టమొదటి సంచార జాతి కమ్యూనిటీ హాల్
హుజురాబాద్ మండలం శాలపల్లి ఇందిరానగర్ గ్రామంలో మొట్టమొదటి సంచార జాతి అయిన గంగిరెద్దుల కులస్తుల కొరకు 10 లక్షల రూపాయల నిధులతో కమిటీ హాల్ నిర్మించడం జరుగుతుందని ఇందిరానగర్ మాజీ కోడిగూటి శారద ప్రవీణ్ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 10 లక్షల రూపాయల నిధులతో మొట్టమొదటిసారిగా ఒక సంచార జాతి గంగిరెద్దుల కులానికి కమ్యూనిటీ హాల్ నిర్మించడం తెలంగాణలోనే మొట్టమొదటిగా చెప్పుకోవచ్చని వారు తెలిపారు.మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ శుభకార్యానికి శ్రీకారం చుట్టడం జరిగిందని త్వరలోనే ఈ కమిటీ హాల్ పూర్తవుతుందని శారదా ప్రవీణ్ తెలిపారు. గంగిరెద్దుల కుల బాంధవుల కొరకు నిర్మిస్తున్న ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషిచేసిన మాజీ సర్పంచ్ కోడిగూటి శారద-ప్రవీణ్ దంపతులకు గంగిరెద్దుల కుల బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.
