జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 16:హుజురాబాద్ లో గులాబీ పార్టీ నుండి మెల్లమెల్లగా ఒక్కొక్క లీడర్ జారుకుంటుంన్నారు.ఇప్పటికే పలువురు అధికారం లో ఉన్న నాయకులు బిఆర్ఎస్ పార్టీ ని వీడి కాంగ్రెస్ లో చేరగా,తాజా గా జమ్మికుంట పట్టణానికి చెందిన కౌన్సిలర్ శ్రీపతి నరేష్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.హైదరాబాద్ లో హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి ఓడితల ప్రణవ్ బాబు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీ లోని ఆహ్వానించారు.ఈ సందర్బంగా శ్రీపతి నరేష్ మాట్లాడుతూ తన చేరికకు సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్,మానకొండూర్ ఎమ్మెల్యే,కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ,హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ప్రణవ్ బాబు,యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు సాయిని రవి, పత్తి కృష్ణా రెడ్డి,గూడెపు సారంగపాణి, దేశిని కోటిలకు కృతజ్ఞతలు తెలిపారు.
