- దేవుడు గుడిలో ఉండాలి-భక్తి గుండెల్లో ఉండాలి
- రాముని అక్షింతలు దేవాలయం పూర్తికాకముందే పంపిణీ చేసి హిందూ సాంప్రదాయాన్ని అవమానపరిచిన మోడీ
- గుండు,అర గుండు ను పక్కకు నెట్టండి
- జమ్మికుంట జన జాతర సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 30:దేవుడు గుడిలో ఉండాలి ,భక్తి గుండెల్లో ఉండాలి అంతేకానీ రాముని పేరు చెప్పుకొని హిందూ సాంప్రదాయానికి మాయని కి మచ్చలు వచ్చే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారని ,అయోధ్య రామాలయం పూర్తికాకముందే రాములోరి అక్షింతలను 15 రోజుల ముందు పంపిణీ చేసి హిందూ సాంప్రదాయాలను మంటగలిపిన ఘన చరిత్ర ప్రధాని మోడీకే దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు.మంగళవారం రోజు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన జన జాతర సభకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మతం పేరుతో అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్న దేశ ప్రజల మధ్య చిచ్చు పెడుతూ రాక్షస ఆనందం పొందుతున్నారని ,రామున్ని తామే దేశ ప్రజలకు దేవునిగా పరిచయం చేసినట్లు డబ్బాలు కొట్టుకోవడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు.గ్రామ దేవతలు మొదలుకొని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి దేవునికి మొక్కుతూ మన హిందూ సాంప్రదాయాన్ని అనాదిగా కాపాడుకుంటూ వస్తుంటే బిజెపి వాళ్లు మాత్రం దేశ ప్రజలకు మేమే హిందుత్వం గురించి నేర్పినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు.మతం పేరుతో ఎన్నికల్లో ప్రచారం కొనసాగిస్తూ ఓటర్లను మాయ చేస్తున్న గుండు అర గుండు గాళ్లను పక్కకు నెట్టి ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీని ఆదరించి మే 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిశాల రాజేందర్రావును రెండు లక్షల పై చీలుకు మెజారిటీతో గెలిపించాలని వేలాదిగా తరలివచ్చిన ప్రజలను ,కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కోరారు.
ఉద్యమాల గడ్డ కరీంనగర్ జిల్లా
పోరాటాల గడ్డ కరీంనగర్ జిల్లా అని తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమానికి ఊపిరిలోది స్వరాష్ట్ర స్వప్నాన్నిసహకారం చేసిన చరిత్ర కలిగిన గడ్డ కరీంనగర్ జిల్లా అని అలాంటి కరీంనగర్ నుండి ఏం.సత్యనారాయణ రావు ,జే.చొక్కా రావు ఇలాంటి నాయకులు పేద ప్రజల కోసం పోరాడిన ఘన చరిత్ర కలిగిన జిల్లా కరీంనగర్ అని ఆయన కొనియాడారు. 2004,2006,2008 లో ఎన్ని సార్లు ఉప ఎన్నికలు వచ్చినా చంద్ర శేఖర్ రావు కు అండగా నిలబడ్డారు. అలాంటి కరీంనగర్ ను కెసిఆర్ నిర్లక్ష్యం చేసి,మిమ్మల్ని వదిలి పాలమూరు కు వస్తె కూడా ఉద్యమాన్ని నీరు గార్చ వద్దు అని కేసిఅర్ ను ఎంపి గా గెలిపించాము.
సెమీ ఫైనల్స్ లో చంద్ర శేఖర్ రావు ను చిత్తు చిత్తుగా ఓడించారు..రాబోయే ఫైనల్స్ లో నరేంద్ర మోడీ నీ కూడా చిత్తుగా ఓడించాల్సి న బాధ్యత మీది..
పార్లమెంట్ ఎన్నికలకు ముందు 2023 నవంబర్లో జరిగిన సెమీఫైనల్ లాంటి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కెసిఆర్ కు కారు కాల్చి వాత పెట్టి బుద్ధి చెప్పిన తెలంగాణ ప్రజలు ఫైనల్ ఎలక్షన్ అయిన పార్లమెంట్ ఎన్నికల్లో మతతత్వ పార్టీ అయినా బిజెపికి బుద్ధి చెప్పి తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 12 స్థానాలను కాంగ్రెస్ పార్టీకి అధిక మెజార్టీతో అందించాల్సిన బాధ్యత ప్రజలందరూగా మీ పైన ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.తెలంగాణకు రావలసిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ,కాజీ పేట్ రైల్ కొచ్ ఫ్యాక్టరి,ఐఐఎం, ఐఐటి తెలంగాణ కు ఇవ్వాల్సి ఉండే కానీ తెలంగాణ కు నరేంద్ర మోడీ ఒక్క రూపాయి ఇవ్వలేదు సరి కదా నరేంద్ర మోడీ 1600 మంది తెలంగాణ అమరుల ను,తెలంగాణ తల్లినీ పార్లమెంట్ లో అవమాన పరిచినప్పుడు పార్లమెంట్ లో బండి సంజయ్ ఉండే ,మరి ఏమి చేసిండు ఐదు సంవత్సరాలలో బండి సంజయ్ ఏటా ఐదు కోట్ల రూపాయల చొప్పున 25 కోట్ల రూపాయలతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుండి గాడిది గుడ్డును మాత్రమే తీసుకొచ్చారని బండి సంజయ్ పై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చేరిగారు.హిందుత్వాన్ని ఓట్ల కోసం బీజేపీ వాళ్ళు వాడుకుంటున్నారు.చిల్లర పైసలు అడుక్కున్నట్లు దేవుడి పొటో చూపించి వోట్లు అడుక్కుంటున్నా బీజేపీ వాల్లు దళితులకు విద్య,ఉద్యోగాల్లో రిజర్వేషన్ ను అంబేత్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా హక్కు కల్పించారు.ఆ హక్కుల ద్వారానే కవ్వంపల్లి సత్యనారాయణ డాక్టర్ అయ్యారు,అడ్లూరు లక్ష్మణ్ ఎంఎల్ఏ అయ్యారు పక్కనే ఉన్న బలరాం నాయక్ మంత్రి అయ్యారు.బీజేపీ వారు మేము కల్పించిన రిజర్వేషన్ ను రద్దు చేసే కుట్రలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో దాదాపు 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయక పక్కన పెట్టారు.400 వందల సీట్లు వస్తె రాజ్యాంగాన్ని సవరణ చేసేందుకు బిజెపి కుట్రలు పన్నుతోందని తీవ్రంగా దుయ్యబడ్డారు .బి సి ,ఎస్ సి ,ఎస్ టి రిజర్వేషన్ లను రద్దు చేస్తారు.కాబట్టిపార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ , బిఆర్ఎస్ పార్టీలను తరిమికొట్టాలని ఓటర్లను కోరారు.ప్రధాని నరేంద్రమోడీ ఇయ్యల్లనో రేపో ఈ కరీంనగర్గడ్డ మీద అడుగుపెడతారు.ప్రజలను మాయ మాటలు చెప్పి మోసం చేసి ఓట్లు దండుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని అలాంటి బీజేపీ పార్టీకిప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.రిజర్వేషన్ లను రద్దు చేసే హక్కు బిజెపి పార్టీకి ఎవరు ఇచ్చారని నిలదీశారు .ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడల్నా,గెలవలా అన్న నిర్ణయాన్ని ప్రజలే తీసుకోవాలని సూచించారు.నేను రెండు మూడు వేదికల్లో రిజర్వేషన్ ల గురించి మాట్లాడినా ,నాకు నోటీసు లు ఇచ్చారు.నన్ను గత ప్రభుత్వ హయాములో కే సి అర్ జైల్ కు పంపాడు.మరి ఇయ్యల్ల ఏమైంది,కార్ కరాబ్ అయింది.కార్ కరాబ్ ఐతే బస్ వేసుకొని వస్తె తిక్కలోడు తిరునాల్లకు పోయినట్లు ఉంది.
బీజేపీ,బిఅర్ఎస్ కు చీకటి ఒప్పందం ఉంది
ఖమ్మం,నల్గొండ లాంటి సీట్లలో బీజేపీ వాళ్లు బిఅర్ ఎస్ కు సపోర్ట్ చేయాలని ఒప్పందం ఉంది.కేసిఆర్ ఇంటి మీద వాలిన కాకి మా గోడ మీద వాలిన కూడా మా కార్యకర్తలు కాల్చి పడేస్తారు.టిఆర్ఎస్ వాళ్ళతో మా ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు.కేసిఆర్ ను ఇండియా కూటమిలో చేర్చుకోవటం లేదు .పార్లమెంట్ ఎన్నికల్లో హాంగ్ పార్లమెంట్ వస్తది అని ,నామా నాగేశ్వరరావు ను ఎంపి నీ చేస్తే మంత్రి అవుతాడు అని కేసిఅర్ అంటున్నాడు.ఈ దేశములో సెక్యులర్ ఇజాన్ని కాపాడాలి అని సిపిఎం , సిపిఎం కాంగ్రెస్ పార్టీతో జత కట్టారు.22 500 కోట్లతో ఇందిరమ్మ ఇండ్ల ను గతములో ఇచ్చాము.వచ్చిన మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చాము .100 రోజుల్లో అనేక పనులు చేసి మంచి పేరు తెచ్చుకున్న ము .15 ఆగస్టు లోపల రెండు లక్షల రుణమాఫీ చేసి మీ యొక్క ఋణ తీర్చుకుంటాం శివుడి సాక్షిగా చెప్తున్నా లేకుంటే ఈ ప్రభుత్వం ఉండి లాభం లేదు.ఎద్దు ఏడ్చిన ఎవ్సం ,రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడినట్లు చరిత్రలో లేదు.అలాంటి రైతులను గుండెల్లో పెట్టుకొని చూసుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికిఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు .ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ,ప్రభుత్వ విప్పు ,ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ,కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ,మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ,ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ,చెరుకు సుధాకర్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్ ,చాడ వెంకటరెడ్డి ,కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిశాల రాజేందర్రావు ,హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ బాబు లతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,భారీ సంఖ్యలోకాంగ్రెస్ పార్టీ అభిమానులు ప్రజలు పాల్గొన్నారు.
