- మహిళలతోనే కుటుంబానికి భరోసా
- బడుగు,బలహీన,వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది
- కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్
వోడితల ప్రణవ్
వీణవంక(ధనాధన్ న్యూస్)మే 06:డైలాగులతో ఓట్ల రాజకీయం చేస్తూ పబ్బం గడుపుతున్న రాజకీయ నాయకులకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.కాంగ్రెస్ పార్లమెంటరీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుకు మద్దతుగా వీణవంక మండలంలోని మామిడాల పల్లి ఉపాధి హామీ కూలీల వద్ద ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ కష్టపడితేనే దేవుడు ఫలితాన్ని అందిస్తాడని,దేవుడి ఫోటో పెట్టుకుని అక్షింతలు వచ్చాయా అంటూ రాజకీయాలు చేయడం సరైనది కాదన్నారు.పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుందని,నాడు ఇందిరమ్మ రాజ్యం నుండి నేడు రేవంత్ రెడ్డి ప్రజా పాలన వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముందుందని పేర్కొన్నారు.మహిళలు ఆరోగ్యవంతంగా ఉన్నతంగా అభివృద్ధి చెందినప్పుడే ఆ కుటుంబం భరోసాగా ఉంటుందని వెల్లడించారు.ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి సెంటిమెంట్ డ్రామాలు ప్లే చేసి గెలిచిన తర్వాత అందుబాటులో ఉండకుండా కేసీఆర్ భజన కార్యక్రమాల్లో నిమగ్నమైపోయారని ధ్వజమెత్తారు.దేవుడి మీద భక్తి గుండెల్లో ఉండాలి. అభివృద్ధి చేతుల్లో ఉండాలని ఒకసారి ప్రజలందరూ ఆలోచించి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.ప్రణవ్ వెంట కాంగ్రెస్ నాయకులు వున్నారు.
