
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: గౌడ కులస్తులు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే వారిని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ముత్యం శంకర్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.వృత్తి రీత్యా తాడిచెట్లు ఎక్కి జీవనం సాగించే గౌడ కులస్తులు నిత్యం ప్రమాదాలు జరగడం కొంత బాధ కలిగిస్తుందని,ఇటీవల జమ్మికుంట మండల పరిధిలోని మడిపల్లి గ్రామంలో మాచర్ల నాగేశ్వర్ గౌడ్ మృతి తీవ్ర బాధను కలిగించిందని,వారికి అండగా నిలవాలని సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వారి కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని చేశారు.ప్రభుత్వం వెంటనే వారి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మటి రాజమల్లు గౌడ్,జమ్మికుంట మండల అధ్యక్షుడు పూదరి విజయ్ గౌడ్,వీణవంక మండల అధ్యక్షుడు తిప్పని సమ్మయ్య గౌడ్,ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు మోటాపోతుల దేవేందర్ గౌడ్,వీరస్వామి గౌడ్,సాంబయ్య గౌడ్,ఐలయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.