హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి నలుగురు డాక్టర్ల నియామకం

By dhanadhannews.com

  • ప్రణవ్ కోరిక మేరకు నలుగురు డాక్టర్లను నియమంచిన జిల్లా కలెక్టర్
  • ఏరియా ఆసుపత్రిపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రణవ్
  • హుజురాబాద్,జమ్మికుంట ఆసుపత్రుల అభివృధ్ధి కొరకు 15 లక్షలు మంజూరు చేయించిన ప్రణవ్
  • రానున్న రోజుల్లో ఖాళీగా ఉన్న వైద్యుల నియామకాలను పూర్తి చేసేలా కృషి చేస్తా

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ లో వైద్యులు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్న హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇంచార్జి ప్రణవ్ త్వరితగతిన వైద్యులను నియమించాలని జిల్లా కలెక్టర్ ను కోరగా స్పందించిన కలెక్టర్ ఏరియా హాస్పిటల్ కు నలుగురు వైద్యులు నియమిస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడించారు.
హుజురాబాద్,జమ్మికుంట ఆసుపత్రులకు 15 లక్షల రూపాయలను వాటి అభివృద్ధి కొరకు కేటాయించేలా కృషి చేశారు.ఆసుపత్రులకు నిత్యం అనేకమంది రోగులు వస్తుంటారు,వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని,రాబోయే కాలంలో హుజురాబాద్ లో ఉన్న అన్ని ఆసుపత్రులకు సిబ్బంది నియమించేలా,వాటిలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే విధంగా మరింత కృషి చేస్తానని తెలిపారు.