ప్రభుత్వ భూమి రక్షణకు కృషి చేయాలి

By dhanadhannews.com

  • ప్రభుత్వ భూమిని గజం ఆక్రమించుకున్న ఉద్యమం తప్పదు
  • జమ్మికుంట మాజీ జడ్పిటిసి డాక్టర్ శ్రీరామ్ శ్యామ్

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని సర్వేనెంబర్ 629, 467,286 లో గల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులదే అని మాజీ జెడ్పిటిసి డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ అన్నారు. గురువారం జమ్మికుంట తహసిల్దార్ కు ప్రభుత్వ భూములు రక్షించాలంటూ వినతి పత్రం సమర్పించిన మాజీ జెడ్పిటిసి శ్యామ్ మాట్లాడుతూ,గత ప్రభుత్వ హయాంలో అధికారుల అండదండలతో నాయకుల సహకారంతో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యాయని ఆయన అన్నారు. అధికారులు సైతం కబ్జాదారులకు అండగా నిలుస్తున్నారని ఒకప్పుడు ప్రభుత్వ భూమి ఇప్పుడు ప్రైవేటు భూమి గా ఎలా మారుతుందని ఆయన ప్రశ్నించారు. ఒకప్పటి పెసర బండ ప్రభుత్వ భూమి జమ్మికుంటలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి తెలుసని అలాంటి భూమి నేడు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కబ్జా అయిందని దానికి అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆయన మండిపడ్డారు.ఒక జిల్లా జడ్జి స్థాయి అధికారి అప్పుడు సర్వే చేసి ఆ స్థలం ప్రభుత్వానిదని తేల్చి చెప్పారు.నేడు సర్వే చేసిన డివిజన్ అధికారి ఆ స్థలం పట్టాదారికే చెందుతుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు.ఈ విషయంపై అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుందని గతంలో ఇచ్చిన అధికారి ది తప్ప లేక ఇప్పుడు సర్వే చేసిన అధికారుల తప్ప త్వరలోనే ఈ విషయంపై జిల్లా కలెక్టర్ తో మాట్లాడుతానని ఆయన తెలిపారు.ఒకే శాఖలో పనిచేసే ఇద్దరు అధికారులు రెండు రకాలుగా సర్వే రిపోర్ట్ లు ఇవ్వడం వెనుక పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయని స్థానికంగా జోరుగా చర్చ జరుగుతుంది.ప్రభుత్వ భూమిని కాపాడే విషయంలో వెనక్కి తగ్గేది లేదని గజం భూమి కూడా కబ్జాదారుల కు చెందకుండా ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు.629లో కోట్లాది రూపాయల విలువైన భూమి అన్యాక్రాంతం అవుతున్న అధికారులు స్పందించడం లేదని ఆయన మండిపడ్డారు.భూ కబ్జా దారులకు అధికారులు వత్తాసు పలకడం సరైన పద్ధతి కాదని ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇందుకు ఉదాహరణ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అమరేందర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.