నువ్వు మగాడివి ఐతే..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్

  • ముఖ్యమంత్రి,మంత్రులపై కౌశిక్ వ్యాఖ్యలు అర్థరహితం
  • ఆరోపణలు తప్ప అభివృధ్ధిపై ద్యాస లేదు
  • ఎం.ఎల్.సీ గా ఉన్న సమయంలో ప్రజలకు నీవు చేసింది శూన్యం
  • దళితులకు అన్యాయం చేసింది నీవు కాదా?
  • మొగోడివైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ హుజురాబాద్ లో గెలువూ

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారతీరుపై హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి వొడితల ప్రణవ్ తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి,మంత్రుల మీద అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని,పార్టీ మారిన ఎమ్మెల్యేల పట్ల మాట్లాడే కౌశిక్ రెడ్డి నిజంగా మొగోడు అయితే హుజురాబాద్ నియోజకవర్గంలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలిపి చూపించాలని అన్నారు.గత పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం అనేక స్కాంలు చేస్తే,10 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక స్కీములు ప్రవేశపెట్టమని అన్నారు. పదేపదే ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ నాయకులపై మాట్లాడితే పెద్ద లీడర్ అవుతానని అనుకోవడం కౌశిక్ రెడ్డి భ్రమ అని కెసిఆర్,కేటీఆర్ మెప్పు పొందడానికి ఇలా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు.గతంలో తాను చెప్పినట్టుగా కౌశిక్ రెడ్డి ఒక బ్లాక్మెయిల్ స్టార్ అని సూసైడ్ పేరు చెప్పి హుజురాబాద్ లో గెలిచాడని అన్నారు.హుజురాబాద్ మార్కెట్ విషయంలో ఇక్కడి ప్రజలకు తీవ్ర అన్యాయాన్ని చేశాడని,దళితుల పట్ల వివక్ష చూపెట్టాడని కేవలం ఓట్ల కోసం మాత్రమే వారిని వాడుకున్నాడని,ఎమ్మెల్సీ గా ఉన్న సమయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు ఇవ్వకుండా,పూర్తి స్థాయిలో దళిత బంధు ఇవ్వకుండా అన్యాయం చేశాడని అన్నాడు.ఎమ్మెల్సీగా,ప్రభుత్వ విప్ గా రెండు సంవత్సరాలు ఉండి ఇక్కడ ప్రజలకు అభివృద్ధి కూడా చేయలేదని ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో తాను హుజురాబాద్ ప్రజలకు ఏం చేశాడో చెప్పాలని అన్నాడు.అధికారంలోకి వచ్చిన పది నెలలలోపే తాము 10 కోట్ల నిధులను అభివృద్ధి చేసి చూపెట్టమని హుజురాబాద్,జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రులకు 30 లక్షలు కేటాయించామని అలాగే ఏల్లుగా ఎదురుచూస్తున్నటువంటి హుజురాబాద్ గ్రౌండ్ ట్రాకర్,ధమ్మక్కపేట గ్రామస్తుల నీటి సమస్యను పరిష్కారం చేస్తున్నామని త్వరలోనే వాటన్నిటికీ సంబంధించిన ప్రొసీడింగ్స్ ఇస్తామని అన్నారు.నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా అడ్డుకొని వారి ఉసురుపోసుకున్న పార్టీ బిఆర్ఎస్ అని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వం కాంగ్రెస్ అని అన్నారు.ప్రభుత్వానికి,ప్రజలకు తాను వారధిగా ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.ఆరు గ్యారెంటీలు అమలు చేశామని,పదేళ్లు అధికారంలో ఉండి రైతులకు రుణమాఫీ చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లోనే రుణమాఫీ చేసిందని సాంకేతిక కారణాల వలన ఆగిన వారికి త్వరలోనే చేస్తామని అన్నారు.