వెన్కేపల్లిలో దివ్యాంగులకు ఉచిత బస్ పాస్ పంపిణీ

By dhanadhannews.com

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలం వెన్కేపల్లి గ్రామపంచాయితీ కార్యాలయంలో మంగళవారం రోజున మ్యాకల రాజు  ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా వచ్చిన హుజురాబాద్ డిఎమ్ చేతులమీదుగా దివ్యాంగులకి ఉచిత బస్ పాస్లు పంపిణీ చేశారు.ముఖ్యఅతిథిగా వచ్చిన హుజురాబాద్ డిఎమ్ కు శాలువాతో సన్మానించారు. అనంతరం హుజూరాబాద్ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ దివ్యాంగులు ఆర్టీసీ ఉచిత బస్ పాస్లు వినియోగించుకోవాలి.ఆర్టీసి బస్సులో ప్రయాణం సురక్షితం అని,ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం వల్ల తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయవచ్చునని,ట్రాఫిక్ సమస్యను  నియంత్రించడం,పర్యావరణం  కాలుష్యం తగ్గుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో పశువైద్యులు విజేందర్ రావు,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంత సుధాకర్,ఆర్టీసీ సిబ్బంది సాయి చరణ్,హరీష్,కొత్త మల్లారెడ్డి,గ్రామ పంచాయితీ కారోబార్ గడ్డం రమేష్,దివ్యాంగులు పాల్గొన్నారు.