- నిరుద్యోగ యువత భవిష్యత్తుకు బంగారు బాట వేసే దిశగా సబ్బని వెంకట్ అడుగులు
- డిగ్రీ కనీస విద్యార్హతతో మార్చిలో జమ్మికుంట పట్టణ కేంద్రంగా మెగా జాబ్ మేళా!
జమ్మికుంట/ధనాధన్ న్యూస్:
సబ్బని వెంకట్ ఆధ్వర్యంలో హుజురాబాద్ కి ప్రాముఖ్యాన్నిస్తూ,కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోని వేల మంది నిరుద్యోగ యువతీ యువకుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మార్చి నెలలో జమ్మికుంట పట్టణ కేంద్రంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తారని సబ్బని వెంకట్ వ్యక్తిగత సహాయకులు అర్జున్ మేడుదల,అరవింద్ అక్కేపల్లి తెలిపారు.
నియోజక వర్గంలో ఉన్న యువత అవకాశాల కోసం వెంకట్ ని సంప్రదిస్తున్న సందర్భంగా, ఇటీవల ఐటీ కంపెనీలు , బ్యాంకులు,ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ , హాస్పిటల్స్ , మాల్స్ తదితర రంగాల్లోని ప్రముఖ కంపెనీ ప్రతినిధులతో సమావేశం జరిపారు.వారు కూడా సానుకూలంగా స్పందించి, మార్చి నెలలో జాబ్ మేళా జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు.
