గ్రామ సభ విజయవంతానికి సహకరించాలి

By dhanadhannews.com

సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో నూతనంగా ఏర్పడిన గర్రెపల్లి  గ్రామ పంచాయతీ ఆవరణంలో గురువారం చేపట్టనున్న మొట్టమొదటి గ్రామ సభను ప్రజలు విజయవంతం చేయాలని అదే గ్రామానికి చెందిన దోకిడి తిరుపతి తెలిపారు.ప్రజల ఇన్ని నాళ్ల కల ఈరోజు తొలి గ్రామపంచాయతీ ఏర్పడడం ద్వారా తీరిందని తెలిపారు.ఇన్నాళ్లు సోమారం గ్రామానికి అనుబంధంగా గర్రెపల్లి గ్రామం ఉందని ఇప్పుడు కొత్తగా గ్రామపంచాయతీ ఏర్పాటుతో ఆనందం వ్యక్తం చేశారు.గ్రామంలోని ప్రజలు అర్హులైన ప్రతి ఒక్కరు ఇంటి నిర్మాణం మంజూరుకై రేషన్ కార్డు రైతు భరోసా తదితర పథకాలకు గ్రామ సభలో దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు.ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు..