సామాజిక కార్యకర్త ముసుగులో బ్లాక్ మెయిల్

By dhanadhannews.com

  • సాబీర్ ఆలిపై  ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
  • కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేష్           

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: సామాజిక కార్యకర్త ముసుగులో అనేక బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న సాబీర్ ఆలీ  పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేష్ అన్నారు. జమ్మికుంట పట్టణంలో గల ప్రెస్ క్లబ్ భవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ సాబీర్ అలీ బ్లాక్మెయిల్ చేస్తూ  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నీరుగారిస్తున్నారని అన్నారు. దళితులకు రక్షణ కవచంగా ఉన్న చట్టాన్ని బ్లాక్ మెయిల్ చేసే వ్యక్తులు నీరు కార్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. గతంలో క్లినికల్ ట్రయల్ పేరుతో కంపెనీవారిని బ్లాక్మెయిల్ చేసి లక్షల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. దళితులకు గిరిజనులకు రక్షణగా ఉన్న చట్టం ను బ్లాక్ మెయిలర్ సాబిర్ ఆలీ  లాంటి వ్యక్తులు బ్లాక్ మెయిల్ చేసి బాధితులకు అన్యాయం చేస్తున్నారని వీరిపై కూడా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని ఉన్నత అధికారులను కోరారు. ఈ సమావేశంలో కెపిహెచ్ జిల్లా ఉపాధ్యక్షులు వడ్లూరి కిషోర్ నాయకులు కనకం చందు, హరీష్, తదితరులు పాల్గొన్నారు.