- 15 సంవత్సరాల తర్వాత కలిసిన విద్యార్థులు
- ఆనాటి మధుర అనుభూతులను నెమరేసుకున్న స్నేహితులు
- 2008-2009 పదవ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: సమాజంలో తల్లీ,తండ్రీ,గురువు దైవంతో సమానమని అంతటి గురువులను కలుసుకోవడం సంతోషంగా ఉందని కాకతీయ విద్యార్థులు అభిప్రాయపడ్డారు.జమ్మికుంట పట్టణంలోని స్వాతి ఫంక్షన్ హాల్ లో కాకతీయ విద్యార్థుల 2008-09 సంవత్సరాలకి చెందిన ఆత్మీయ సమ్మేళనం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకతీయ విద్యాసంస్థల అధినేత ఆవిరినేని సుధాకర్ రావు,జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు,పట్టణ సీఐ వరంగంటి రవి హాజరయ్యారు.అనంతరం వారు మాట్లాడుతూ ఏ వ్యక్తికైనా తల్లిదండ్రులు మొదటి గురువులైతే,విద్యను బోధించిన గురువు రెండవ గురువని,నవ మాసాలు మోసి కనీ పెంచితే,భాహ్య ప్రపంచానికి క్రమశిక్షణ,మంచి నడవడిక ఎలా ఉండాలో తెలియజేసేది గురువు అని,జీవితంలో మరపురాని రూపం బాల్యం అని అలాంటి బాల్యంలో చదువు చెప్పిన గురువులను సన్మానించడం గొప్ప విషయమని అన్నారు.పదిహేను సంవత్సరాల తర్వాత కలుసుకున్న స్నేహితులు చిరునవ్వులతో,ఆత్మీయ పలకరింపులు,ఆలింగనాల నడుమ నాటి మధుర స్మృతులను నెమరేసుకున్నారు.తమకు విద్యాబుద్ధులు చెప్పిన నాటి గురువులను పూర్వ విద్యార్థులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.వివిధ వృత్తులలో ప్రభుత్వ,ప్రైవేటు ఉద్యోగాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలలో కలసి తిరిగి తమ అనుబంధాలను స్మరించుకున్నారు.తమ విద్య,వైవాహిక,ఉద్యోగ జీవిత విశేషాలు కుటుంబ నేపథ్యాల విషయాల గురించి తెలుసుకొని,ఆనందోత్సాహాలతో గడిపారు.ఈ కార్యక్రమములో అధ్యాపకులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
