కుల సంఘ భవనాలకు లక్కీ డ్రా తీసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.

కెసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కులాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చారని హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.మంగళవారం హుజరాబాద్ నియోజకవర్గం లోని కమలాపూర్ లో కుల సంఘాల లక్కీ డ్రా లో పాల్గొని మాట్లాడారు. కెసిఆర్ ఇచ్చిన మాట ప్రకారమే నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండలాల్లో కుల సంఘాల భవనాలు కట్టించారని అన్నారు. కుల సంఘాల భవనాలను గతంలోనే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభోత్సవం చేశారని ఆయన అన్నారు. కుల సంఘాల … Read more

ముద్ర దినపత్రిక అనతి కాలంలోనే ప్రజల అభిమానాన్ని చురగొన్నది..

జమ్మికుంట,ధనా ధన్ న్యూస్: ముద్ర దినపత్రిక అనాతి కాలంలో ప్రజల అభిమానాన్ని,ఆదరణను చురగోన్నది అని పిఎసిఎస్ చైర్మన్ పొన్నగంటి సంపత్ అన్నారు.జమ్మికుంట పట్టణంలోని పిఎసిఎస్ చైర్మన్ పొనగంటి సంపత్ ఆధ్వర్యంలో ముద్ర దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పత్రికా యాజమాన్యాన్ని సిబ్బందిని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు నేటి సమాజంలో పత్రికల పాత్ర కీలకమైందని వీటికి స్వేచ్ఛ ముఖ్యమన్నారు పత్రికల్లో పని చేసే జర్నలిస్టులకు పత్రికలకు కూడా స్వేచ్ఛ ఉండాలని తెలిపారు. ఎవరికి … Read more

ధనా ధన్ న్యూస్ పోర్టల్ ని లాంచ్ చేసిన ప్రొఫెసర్ కోదండరాం.

-ఈ డిజిటల్ యుగంలో డిజిటల్ మీడియా పాత్ర కీలకం. -వార్తకోసం వెయిట్ చేయవలసిన అవసరం లేదు. -ఎప్పటి వార్తలు అప్పుడే చూసుకోవచ్చు. -ప్రజా సమస్యలపై ప్రతినిత్యం ప్రభుత్వానికి ప్రజలకు వారధి ఉండాలే. హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ లో జరిగిన పీవి హుజురాబాద్ జిల్లా సాధన సదస్సు కార్యక్రమానికి తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు,ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో ధనా ధన్ న్యూస్ పోర్టల్ ని ఆయన లాంచ్ చేశారు.ఈ సందర్బంగా … Read more

ప్రొఫెసర్ కోదండరాం ని సన్మానించిన విద్యార్థి నాయకులు..

-ఉద్యమకారులను గౌరవించిన తెలంగాణ ప్రభుత్వం. -తెలంగాణ ఉద్యమకారుల ప్రతినిధి ప్రొఫెసర్ కోదండరాం. హుజురాబాద్ పట్టణానికి విచ్చేసిన తెలంగాణ ఉద్యమ రథసారధి ప్రొఫెసర్ కోదండరాం నూతనంగా ఎమ్మెల్సీ గా నియామకం అయిన సంధర్భంగా తెలంగాణ ఉద్యమకారులు అన్నం ప్రవీణ్ బృందం అధ్వర్యంలో ఆత్మీయ సన్మానంతో సత్కరించడం జరిగింది.తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకులు అన్నం ప్రవీణ్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించింది ఉద్యమకారులేనని, వారి పాత్ర మరువలేనిదని అన్నారు. తెలంగాణ ఉద్యమ ఘట్టంలో అన్నీ పార్టీలను … Read more

మేడారం మహా జాతర పోస్టర్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం మహా జాతర పోస్టర్‌ను శనివారం సాయంత్రం ఆవిష్క రించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, అధికారులు ఉన్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. సమ్మక్క – సారలమ్మ తల్లులను దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు తరలి రానున్నారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం జాతర జరగనుంది. భక్తులకు ఇబ్బంది … Read more

రోడ్డు విస్తరణ కోసం సొంత ఇంటిని కూల్చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే.

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. గత ఏడాది జరిగిన సవాళ్లు, ప్రతి సవాళ్ళలో చెప్పినట్టుగానే రోడ్డు వెడల్పుకు అడ్డుగా ఉన్న తన సొంత ఇంటిని కూల్చేసి మాట నిలబెట్టుకున్నారు. మిగతా వాళ్ళు కూడా రోడ్డు వెడల్పు కోసం సహకరించా లని కోరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి రైల్వే గేటు వరకు పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం … Read more

కాంగ్రెస్ గూటికి బిఆర్ఎస్ నేత మల్లికార్జున రాజేందర్

మంత్రి రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణానికి చెందిన మాజీ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ తో పాటు పలువురు బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.మంత్రి పొన్నం ప్రభాకర్,మాజీ యం.ఎల్.సి టి.సంతోష్ కుమార్ బిఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.గతంలో కాంగ్రెస్ పార్టీలో జిల్లా స్థాయి పదవులతో పాటు కార్పొరేటర్ గా అవకాశాలు ఇచ్చిన కాంగ్రెస్ గూటికి చేరడం సంతోషంగా ఉందని, … Read more

ఏపీలో తెలంగాణ మంత్రుల ప్రచారం?.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ముఖ్య నేతలను ప్రచారం చేయించాలని ఆ పార్టీ అధిష్ఠానం భావిస్తున్నది. ఫిబ్రవరి 15 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్‌ రావొచ్చన్న నేపథ్యంలో ఆ పార్టీ ముందస్తు ప్రచారానికి దిగేందుకు సిద్ధమైంది. తెలంగాణలో గెలుపు, ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల నియామకం వంటివి పార్టీని ఏపీలో బలోపేతం చేస్తాయని కాంగ్రెస్‌ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రులు, సీనియర్‌ నాయకుల సేవలను వాడుకోవాలని … Read more

రేపు తెలంగాణ జిల్లాలలో అమిత్ షా పర్యటన.

రేపు బీజేపీ కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ఉదయం 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా కరీంనగర్ చేరుకుంటారు. మధ్యాహ్నం 1గంట సమయంలో కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ బూత్ స్థాయి కార్యకర్తలతో అమిత్ షా సమావేశం అవుతారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా మహబూబ్ నగర్ జిల్లాకు చేరుకుంటారు. అక్కడ మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గాల ఆఫీస్ బేరర్స్ తో … Read more

దళిత బంధు రెండవ విడత కోసం లబ్ధిదారుల ఎదురుచూపు.

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 14వ వార్డు ఆబాది జమ్మికుంటలో దళిత బంధు లబ్ధిదారులు రెండో విడత నిధులను ఎలాగైనా మంజూరు చేసి మా దళితులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి తమ గోడు వెళ్లబోసుకున్నారు.గతంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎలా ఇచ్చారో ఇప్పుడు కూడా అదే మాదిరిగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు భోగం వెంకటేష్ మాట్లాడుతూ దళితబందు మొదటి విడత వచ్చి … Read more