సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని అమ్మనగుర్తి గ్రామానికి చెందిన దెంచ నాలా శ్రీనివాస్ గతంలో బిజెపి యువమోర్చా మండల అధ్యక్షులుగా,బిజెపి మండల పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన పని తీరును గుర్తించి ప్రస్తుతం రాష్ట్ర పార్టీ నాయకత్వం నూతన అధ్యక్షుల నియామకంలో భాగంగా దెంచనాల శ్రీనివాస్ ను గురువారం రోజున బిజెపి మండల పార్టీ అధ్యక్షులుగా సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి సారంగుల అమర్నాథ్ ప్రకటించినట్లు శ్రీనివాస్ ప్రకటన లో తెలిపారు.నూతన బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ బిజెపి పార్టీ మండల అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరియు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గంగాడి మోహన్ రెడ్డి,బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి,జిల్లా,మండల పార్టీ వివిధ హోదాలో ఉన్న నాయకులకు తాజా మాజి ప్రజా ప్రతినిధులకు బిజెపి పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రతి కృతజ్ఞతలు తెలియజేశారు.తనపై నమ్మకం ఉంచి పార్టీ అధ్యక్షునిగా ఆయనను ఎన్నుకున్నందుకు పార్టీ కోసం పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని శ్రీనివాస్ తెలిపారు.
