ప్రభుత్వ పాఠశాలలోని విద్యుత్ మోటార్ ధ్వంసం

By dhanadhannews.com

  • బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
  • పాఠశాల ప్రిన్సిపాల్ సమ్మయ్య

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మండలంలోని కోరపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో పీఎంకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విద్యుత్ మోటార్ ను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.పాఠశాలలోని విద్యార్థుల సౌకర్యార్థం మంచినీటి కోసమై పిఎంకె ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోరుతోపాటు మోటార్ మంజూరు చేయించి స్కూల్ యాజమాన్యానికి అప్పగించడం జరిగింది.దీనిలో భాగంగా ఆదివారం గుర్తు తెలియని దుండగులు హైస్కూల్లో ఉన్న మోటార్ ను ధ్వంసం చేయడంతో పాటు సంబంధిత పైపును కట్ చేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సమ్మయ్య పిఎంకె ఫౌండేషన్ నిర్వాహకులు గండి రంజిత్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మోటార్ ను ధ్వంసం చేయడం మంచి పద్ధతి కాదని కొంతమంది రాత్రి వేళలో పాఠశాల ఆవరణంలో కూర్చుని అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారని అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని  వెల్లడించారు.ఎవరైనా గాని ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు.