ప్రశాంత వాతావరణంలో దసరా పండగ జరుపుకోవాలి

By dhanadhannews.com

  • మండల ప్రజలకు దసరా శుభాకాంక్షలు
  • జమ్మికుంట పట్టణ సీఐ వరంగంటి రవి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: దసరా పండుగను ప్రశాంత వాతావరణంలో జమ్మికుంట మండల ప్రజలు జరుపుకోవాలని జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి ప్రజలకు సూచించారు… శుక్రవారం జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని మోత్కులగూడెంలో గ్రామ పెద్దలు ప్రజల తో సిఐ సమావేశం నిర్వహించి దసరా పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి ఎలాంటి గొడవలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సిఐ తెలిపారు. ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన అనవసరమైన గొడవలకు తెరలేపిన చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని సూచించారు. ప్రజలందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో దసరా పండుగ నిర్వహించుకొని మిగతా వారికి ఇబ్బంది కలగకుండా సంతోషంగా ఉండాలని తెలిపారు… ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పొన్నగంటి మల్లయ్య పిఎసిఎస్ చైర్మన్ పొన్నగంటి సంపత్ పొనగంటి సారంగం బిట్ల మోహన్ పొన్నగంటి విజయ మల్లయ్య గ్రామ పెద్దలు తదితరులు ఉన్నారు. దసరా పండుగ సందర్భంగా మండల ప్రజలందరికీ సీఐ వరగంటి రవి గారు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి మీ జీవితాల్లో విజయాలను చేకూర్చాలని ఆయన తెలిపారు.