మాజీ మున్సిపల్ చైర్మన్ విజయ్ కుమార్ సేవలు ఆదర్శప్రాయం

  • మానవ విలువల పరిరక్షణ సేవ సంస్థ జాతీయ అధ్యక్షులు సత్యంగౌడ్
  • ఘనంగా విజయ్ కుమార్ జన్మదిన వేడుకలు

హుజురాబాద్/ధనాధన్: హుజురాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయకుమార్ (బ్రహ్మచారి) నిస్వార్థ ప్రజా సేవలు ఆదర్శప్రాయమని ప్రజాకవి రచయిత మానవ విలువల పరిరక్షణ సేవ సంస్థ జాతీయ అధ్యక్షులు నాగుల సత్యం గౌడ్ అన్నారు. పట్టణంలోని అవంతి కన్వెన్షన్ హాల్లో ఆదివారం ప్రజాకవి నాగుల సత్యం గౌడ్ ఆధ్వర్యంలో వడ్లూరి విజయ్ కుమార్ 57వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేశారు. అనంతరం మంచి మనసే దేవుడి మందిరం అనే కవిత జ్ఞాపకం అందజేసి, పట్టు శాలువ కప్పి ఘనంగా  సత్కరించారు. స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. పట్టణంలోని పలు ప్రధాన ప్రాంతాలలో, పలు కార్యాలయలలో కూడా  విజయ్ కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాకవి సత్యంగౌడ్ మాట్లాడుతూ.. హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్ గా విజయ్ కుమార్ తన హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి, రాష్ట్రంలోనే మంచి గుర్తింపు పొందడన్నారు. హుజురాబాద్ ప్రజల మనసుల్లో మంచి వ్యక్తిగా ప్రజా సేవకుడిగా చోటు సంపాదించుకున్నాడన్నారు. ఎందరో పేదలకు సహకరిస్తూ, ఆపదలో ఉన్నవారికి ఎందరికో తన వంతు సహాయాన్ని చేసి సేవలోనే నాకు ఎంతో సంతృప్తిని ఇస్తుందన్న విజయ్ కుమార్ మంచి మనసుకు నిలువెత్తు నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు కట్కూరి మల్లారెడ్డి, గూడూరి కొండల్ రెడ్డి, కె బాపురావు, పొనగంటి శ్రావణ్ కుమార్, కోళ్ల రాజన్న, శ్రావణ్, సూర్య కిరణ్, చిట్టి కుమార్, ఇమ్రాన్, జడల సమ్మయ్య, మహేందర్ రెడ్డి, చందు, కోమల్ రెడ్డి, సాయిల రాజు, నవీన్, మనమయ సంఘం మాజీ అధ్యక్షుడు నందగిరి శ్రీనివాస్, కళాసాగర్, అశోక్, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.