గ్రామానికి అండగా విగ్రహ ప్రతిష్టాపనలు

By dhanadhannews.com

  • పోచమ్మ తల్లి బోనాలతో సుభిక్షంగా పాడిపంటలు
  • గ్రామ దేవతలకు నిలయాలు పల్లెలు
  • సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబాలు గ్రామాలు
  • పలు దేవాలయాల ఉత్సవాల్లో పాల్గొన్న
    హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్

వీణవంక మార్చ్ 27:వీణవంక మండలంలోని చల్లూరు,మామిడాలపల్లి  పలు దేవాలయాల్లో,దేవాలయ ఉత్సవాల్లో హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ వోడితల ప్రణవ్  పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.చల్లూరు గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో వార్షిక, బ్రహ్మోత్సవాలలో చివరి రోజు భాగంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.ఆలయ అర్చకులు వేదమంత్రాలతో  హారతి సమర్పిస్తూ బ్రాహ్మణ ఆశీర్వచనాలు అందజేశారు.రథోత్సవం  సందర్భంగా రథంపై టెంకాయ కొట్టి పూజలు జరిపారు.

అనంతరం అదే గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో  జరుగుతున్న పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాలు పాల్గొని,మహిళలతో కాసేపు ముచ్చటించారు.మాడెలయ్య దేవాలయంలో టెంకాయ కొట్టి ప్రత్యేక పూజలు జరిపారు.అనంతరం మామిడాలపల్లి  గ్రామంలో నూతనంగా ప్రతిక్షేపించనున్న  శ్రీ రాజా   రాజేశ్వర దేవాలయంలో ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.వేద బ్రాహ్మణులు మంత్రోత్సవ నడుమ,దేవత ఆశీర్వాదములు అందజేస్తూ,అక్షింతలు వేస్తూ, దేవతామూర్తులకు  ప్రత్యేక పూజలు జరిపిస్తూ,ప్రణవ్ కు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.టెంకాయ కొట్టి స్వామివారి తీర్థ ప్రసాదాల స్వీకరించారు. వోడితల ప్రణవ్ వెంట కాంగ్రెస్ నాయకులు తిప్పారపు సంపత్, కిరణ్ తోపాటు మామిడాల పల్లి గ్రామానికి చెందిన ఎడ్ల లావణ్య – రవీందర్ రెడ్డిల ఆధ్వర్యంలో మహా అన్నదాన తీర్థ ప్రసాదాలను ఏర్పాటు చేయడంతో గ్రామ ప్రజలు ఆనందంగా స్వీకరించారు.కాంగ్రెస్ నాయకులు శ్యాంసుందర్ రెడ్డి,సాహెబ్ హుస్సేన్,రెడ్డి సంఘం సీనియర్ నాయకులు నల్ల కొండల్ రెడ్డి,జైపాల్ రెడ్డి, ఈ కార్యక్రమంలో మాజీ  ఎంపిటిసి  మూల రజిత- పుల్లారెడ్డి,శ్రీరామోజు చంద్రమౌళి, మాజీ సర్పంచ్ బండ సుజాత- కిషన్ రెడ్డి,జెడ్పిటిసి మాదాడి శ్రీదేవి తాళ్ల పెళ్లి తిరుమలేష్, కనకం వెంకట స్వామి, నరసింహారెడ్డి, నల్ల కొండల్ రెడ్డి,సత్యనారాయణ,రాంగోపాల్ రెడ్డి,గురు,విశ్వకర్మ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ ఉదారపు నరసింహ చారి, యూత్ నాయకులు సజ్జాద్, ఆయా గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు,గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.