బోడిగే శ్రీకాంత్
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బుడిగె శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఎన్నికలు జరుగబోతున్న సందర్భంగా,జమ్మికుంట మండల మరియు పట్టణానికి చెందిన విద్యార్థిని విద్యార్థుల, యువతి యువకుల మద్దతుతో జమ్మికుంట అధ్యక్ష బరిలో నిలిచినట్టు తెలిపారు.
తాను గతంలో విద్యార్థి నాయకునిగా, విద్యార్థుల సమస్యల పట్ల తలపెట్టిన ప్రతీ కార్యక్రమంలో పాల్గొని,నాటి నుంచి నేటి వరకు ఎంతైతే బాధ్యతతో పనిచేస్తున్నానో అంతే అంకుటిత దీక్షతో యువతి యువకుల సమస్యలు తీర్చడంలో, వారికి అండగా నిలబడడంలో ముందు వరుసలో ఉంటానని పేర్కొన్నారు. జమ్మికుంట మండల మరియు పట్టణ యువతీ యువకుల చిరకాల కోరిక అయినటువంటి మినీ స్టేడియంను జమ్మికుంట పట్టణంలో ఏర్పాటు చేయడానికి అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి, ఇక్కడ ఏర్పాటు చేసేలా కృషి చేస్తానని, తద్వారా యువతి యువకులు క్రీడారంగంలో ఈ ప్రాంతం నుండి రాష్ట్రస్థాయికి, జాతీయస్థాయికి వెళ్లే ఆస్కారం ఉందని తెలిపారు.
ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా యువతి యువకులకు మరియు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ వారి సమస్యలను వెంటనే నెరవేర్చగల సామర్థ్యం ఉన్న యువ నాయకులను ఎన్నుకోవాలని యువతి యువకులందరినీ కోరారు. ఈ ఎన్నిక IYC APP ద్వారా ఉంటుందని యువతి యువకులందరూ ఎన్నికల్లో పాల్గొని కీలక పాత్ర పోషించాలని కోరారు.
అదే విధంగా, జమ్మికుంట మండల మరియు పట్టణ ప్రాంత యువతి యువకులకు ఏ సమస్య ఉన్న తక్షణమే స్పందించి, ఆ సమస్యను పరిష్కరించే విధంగా ఒక హెల్ప్ సెంటర్ ను ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు.
